అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలకు షాక్.. చివరికి ఏమైందో తెలిస్తే అవాక్కవుతారు!

అడవిలో జీవించే ఎద్దులు, బర్రెలకు సింహాలు, పులుల నుంచి ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది.గుంపులో ఉన్న అడవి దున్నలపై కూడా సింహాలు దాడి చేస్తుంటాయి.

ఈ జంతువులు బలంగా ఉన్నప్పటికీ.సింహాలకు ఎదురుతిరిగి దాడి చేసేందుకు ధైర్యం చేయవు.

ప్రాణాలను కాపాడుకునేందుకు దేని దారిన అవి పరుగులు తీస్తుంటాయి.ఇలా ఐక్యమత్యం లేకపోవడం వల్లే ఎక్కువ సంఖ్యలో ఉన్న దున్నలను సైతం సింహాలు ఆహారంగా మార్చుకుంటున్నాయి.

అయితే తాజాగా మాత్రం అడవి దున్నలు ఐక్యమత్యమే మహాబలం అంటూ సింహాలకు వణుకు పుట్టించాయి.ప్రతీసారి ప్రాణభయంతో ఉరికే దున్నలు ఈసారి సింహాలనే ప్రాణభయంతో ఉరికేలా చేశాయి.

Advertisement

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.వైరల్ అయిన వీడియోలో ఒక నీటి గుంట వద్ద ఒక పెద్ద అడవి దున్నను మూడు సింహాలు చుట్టి ముట్టినట్లు గమనించవచ్చు.

ఒక సింహం అమాంతం ఆ దున్న వెనుకవైపు దాడి చేయగా మరొకటి ఏకంగా గొంతునే నోటితో గట్టిగా కరుచుకుంది.ఒకేసారి సింహాలు దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో అచేతనంగా మారిపోయింది సదరు దున్న.

ఇక చావు తప్పదు అని అది ఆశలు వదిలేసుకున్న సమయంలోనే ఒక అద్భుతం జరిగింది.అదేంటంటే దానితోటి దున్నలు కాపాడడానికి ముందుకు వచ్చాయి.

ఒక అడవిదున్న ఒక సింహాన్ని కొమ్ములతో పైకి లేపి నేలకేసి కుదేసింది.ఆ దెబ్బతో సింహం దిమ్మతిరిగినట్లయింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దాంతో అది అక్కడి నుంచి ఉరుకులు పరుగులు పెట్టింది.మరొక సింహం కూడా చల్లగా జారుకుంది.

Advertisement

ఈలోగా మరొక అడవిదున్న కూడా రావడంతో ఇక సింహాలు మళ్ళీ తిరిగి దాడి చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సరైన సమయంలో సరైన సహాయం అందించడంలో ఆ దున్నపోతు బతికింది అని.ఇలా ప్రతిసారి ఐకమత్యంగా ఉంటే ఏ అడవి దున్న కూడా చనిపోదని కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు