ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది.అయితే అక్కడ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం పొందాడు.కనుక కచ్చితంగా వైఎస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నాడని.
అయితే ఆ విషయాన్ని కనీసం పార్టీ ముఖ్య నేతలకు కూడా చెప్పకుండా ఒక్కరు ఇద్దరు అత్యంత సన్నిహితులకు మాత్రమే చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది.అందుకే వైకాపా శ్రేణులను హడావుడి చేయడం మొదలుకుని పార్టీ వ్యూహకర్త తో కసరత్తులు చేయిస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాలను ఎవరికి ఇవ్వాలి అనే విషయమై కూడా చర్చ జరుగుతోంది.ఇక సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఎన్నికలు జరిగితే అంటే రాబోయే అయిదు ఆరు నెలల్లో ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఎంత అనే విషయమై సర్వేలు చేయించడం జరిగింది.

మొత్తానికి జగన్( YS Jagan Mohan Reddy ) చాలా చర్చలు రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడు అంటూ రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయిదు ఆరు నెలల్లో ఏపీలో ఉప ఎన్నికలు వస్తే కచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వైకాపా( YCP ) కు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి.జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే జనాల్లో తిరగడం మొదలు అయ్యింది.

తెలుగు దేశం పార్టీ ( TDP )నాయకులు ఇంకాస్త సమయం ఉంది కదా అని చల్లగానే ఉన్నారు.ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా వైకాపా కు ప్రయోజనం ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.సీట్ల సంఖ్య తగ్గినా కూడా అధికారం మాత్రం జగన్ కు దక్కుతుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది భారీగా ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఒకటి రెండు నెలల్లో ఏదైనా జరగవచ్చు అంటూ అన్ని పార్టీల నాయకులు హడావుడిగా ఉన్నారు.