పాములతో ప్రీ వెడ్డింగ్ షూట్.. వీరికి పిచ్చి బాగా ముదిరిందిగా..

ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్‌లు( Pre Wedding Shoot ) సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతున్నాయి.పెళ్లి ముందే చేయించుకునే ప్రీ వెడ్డింగ్ షూట్‌లు వివాదానికి దారితీస్తున్నాయి.

 Couple Do Pre Wedding Shoot With Live Snakes Pics Viral Details, Pre Wedding Sho-TeluguStop.com

సోషల్ మీడియాలో కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి.ఫొటోల పిచ్చి, లైక్‌ల మోజు, బాగా పాపులర్ అయిపోయాలనే కారణంతో కొంతమంది వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు చేయించుకుంటున్నారు.

గతంలో న్యూడ్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్న ఫొటోలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది.

Telugu Latest, Live, Pre, Snake-Latest News - Telugu

అయితే తాజాగా విభిన్నమైన ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ఏకంగా పాములతో ( Snakes ) కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు.వధూవరులు పాముల వల్ల కలిశారనే అర్ధం వచ్చేలా ప్రీ వెడ్డింగ్ షూట్ చిత్రీకరించారు.

ఇందులో యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పాము దర్శనమిస్తుంది.ఆమె భయపడి రెస్క్యూ టీమ్‌కు కాల్ చేయగా.

ఇద్దరు యువకులు స్కూటీపై వస్తారు.వారిలో ఒక యువకుడు పామును పట్టుకోగా.

ఆ యవకుడు వెళ్లేటప్పుడు ఫోన్ చేయవని యువతికి సిగ్నల్ ఇస్తాడు.

Telugu Latest, Live, Pre, Snake-Latest News - Telugu

పాము కారణంగా ఇద్దరూ పరిచయమై తర్వాత ప్రేమలో పడతారు.ఈ సీన్‌ను ప్రతిబింబించేలా పాములతో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది.వివేక్ ( Vivek ) అనే వ్యక్తి దీనికి సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి.

పాములతో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటి అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.మీకు ఇదేం పిచ్చి అంటూ కొంతమంది తిడుతున్నారు.మరికొంతమంది వీళ్ల ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాములను హింసిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.

అసలు ప్రీ వెడ్డింగ్ షూట్‌లను బ్యాన్ చేయాలంటూ మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube