టిడిపి గెలిస్తే లోకేష్ పరిస్థితి ఏంటి ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఖచ్చితంగా టిడిపి గెలిచి అధికార పీఠంపై కూర్చుంటుందనే అంచనాలు టిడిపి,  జనసేన, బిజెపిలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో వైసీపీపై రాజకీయ యుద్ధానికి దిగాయి.

తమ మూడు పార్టీల బలంతో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం న్నాచేస్తుయి.

కచ్చితంగా అధికారంలోకి వస్తాము అని, ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వస్తే .టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటిస్తారా అనే దానిపైన తీవ్రంగా చర్చ జరుగుతుంది.2014 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబు( Chandrababu Naidu ) మంత్రివర్గంలో  కీలక శాఖల మంత్రిగా పనిచేశారు.

 2019 టిడిపి కమిటీ అధికారం చేపడితే కచ్చితంగా లోకేష్( Nara lokesh ) ముఖ్యమంత్రి అయ్యే వారు.చంద్రబాబు కూడా అప్పట్లో ఆ ఆలోచనతోనే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.కానీ అప్పుడు వైసిపి అధికారంలోకి రావడంతో సీఎం ఆశలు నెరవేరలేదు .ఇప్పుడు టిడిపి కూటమి గెలిస్తే లోకేష్ ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటిస్తారని టిడిపి కీలక నాయకులు అంచనా వేస్తున్నారు.సొంతంగా టిడిపికి 105 సీట్లకు పైగా వస్తే లొకేష్ ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటిస్తారని,  ఒకవేళ టిడిపికి మేజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు వచ్చి కూటమి లోని జనసేన,  బిజెపి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

 ఎందుకంటే లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కూటమిలో ని జనసేన,  బీజేపీ( Jana Sena, BJP)లు అడ్డు చెప్పే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నా.  వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు.

Advertisement

చంద్రబాబు రాజకీయ వారసుడిగా టిడిపిని ముందుకు నడిపించాల్సిన బరువు బాధ్యతలు లోకేష్ పైనే ఉంటాయి.అందుకే ముందుగానే సీఎం స్థాయి వ్యక్తిగా లోకేష్ ఇమేజ్ ను పెంచేందుకు చంద్రబాబు తప్పకుండా ప్రయత్నిస్తారని,  అవకాశం ఉన్నంతవరకు లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆయన ఎక్కువ మొగ్గు చూపిస్తారని, ఈ విషయంలో కూటమి లో ఉన్న జనసేన , బిజెపి లను ఒప్పిస్తారనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?
Advertisement

తాజా వార్తలు