కోమటి రెడ్డి బ్రదర్స్ రూటెటు?....

కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వారు తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఉండరనేది ఒప్పుకొని తీరాల్సిన సత్యం.

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో కోమటి రెడ్డి బ్రదర్స్ హవా మామూలుగా ఉండదు.

కోమటి రెడ్డి బ్రదర్స్ లో పెద్ద వెంకట్ రెడ్డి ఎంపీగా ఉండగా.చిన్నవాడైన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.

కోమటి రెడ్డి బ్రదర్స్ అంటేనే ఫైర్ బ్రాండ్లని చాలా మంది చెబుతారు.కానీ అలాంటి బ్రదర్స్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు ఉంది.

పీసీసీ అధ్యక్ష పదవి తననే వరిస్తుందని.ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

కానీ ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం సహచర ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగిస్తూ.ఉత్తర్వులు జారీ చేసింది.

మరో వైపు ఎమ్మెల్యేగా ఉన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఎల్లప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంటాయి.చాన్నళ్ల క్రితమే.

తాను త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటానని కామెంట్లు చేసి.అధిష్టానం గుండెల్లో బాంబు పేల్చారు.

ఇన్నాళ్లు ఊరించిన పీసీసీ పీఠం కూడా చేజారిన తర్వాత బ్రదర్స్ దారెటు అని రాష్ర్ట రాజకీయాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి.కాషాయ దళంలో చేరారు.త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల అక్కడ కాషాయ జెండా తో పోటీ చేస్తున్నాడు.ఒక వేళ.ఈటల రాజేందర్ గెలిచి.బీజేపీ నిలిస్తే.

ముందుగానే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు కాషాయ కండువా కప్పుకుంటాడా అనే అనుమానం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.పీసీసీ నూతన అధ్యక్షుడిగా నిమమితుడైన రేవంత్ రెడ్డికి వీరివురూ ఏ మేరకు సహకరిస్తారో చూడాలి.

తాజా వార్తలు