వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా...

ఏపీ రాజకీయాలు మస్తు రంజుగా ఉంటాయి.ఇక్కడి రాజకీయాలను పరిశీలించాలానే కానీ మనకు చాలా అంశాలు కనిపిస్తుంటాయి.

ఇక్కడ ఎప్పటికీ ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది.అలాగే ప్రస్తుతం కూడా ఓ ఆంశం మీద అక్కడ చర్చ నడుస్తోంది.

అదే వైసీపీ రాజ్య సభ టికెట్​ గురించి.మొన్నా మధ్య మెగాస్టార్ చిరంజీవి జగన్ తో భేటీ అయ్యేసరికి అంతా జగన్ చిరంజీవికి రాజ్య సభ ఎంపీ సీటు ఇస్తున్నారని అనుకున్నారు.

దీనిపై మీడియాలో కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగింది.కానీ చివరికి చిరంజీవి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ప్రస్తుతం ఇదే విషయం గురించి జగన్ బాబాయ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జగన్ తనను గుర్తించడం లేదని సుబ్బా రెడ్డి బాధపడుతున్నారని, అందుకే అటువంటి వ్యాఖ్యలు చేశారని చాలా మంది చర్చించుకుంటున్నారు.

ఇంతకీ సుబ్బా రెడ్డి ఏమని వ్యాఖ్యానించాడంటే.సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంతో సర్కారును కలిసేందుకు సినీ ఇండస్ట్రీ తరఫున మెగా స్టార్ చిరంజీవి వెళ్లారు.

ఆయన జగన్ తో భేటీ అయి వచ్చిన దగ్గరి నుంచి చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి.అనేక మీడియాల్లో ఈ వార్తలు వచ్చాయి.

దీంతో చిరంజీవి తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని , తాను ఏ పార్టీకి కూడా మద్దతు పలకట్లేదని, కేవలం సినీ ఇండస్ట్రీ తరఫునే జగన్ వద్దకు వెళ్లానని తెలిపారు.ఇంతటితో ఈ ప్రచారానికి పుల్​ స్టాప్​ పడింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కానీ ప్రస్తుతం వైసీపీ నాయకుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.వైసీపీ పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే సీట్లు ఇస్తామని బయటి వాళ్లకు ఇవ్వమని ఆయన తేల్చి చెప్పారు.

Advertisement

వైవీ సుబ్బా రెడ్డి కూడా చాలా రోజుల నుంచి రాజ్యసభ టికెట్​ కోసం ఆశపడుతున్నారు.ఎలాగైనా సరే రాజ్య సభలో ఎంపీగా కాలుమోపాలని చూస్తున్నారు.

తాజా వార్తలు