ఒక్కో వ్యక్తికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది.అందులో భాగంగానే వారి లైఫ్ స్టైల్ ఉంటుంది.
తమ కంటూ ఓప్రత్యేకత ఉండాలి అనుకుంటారు.అందులో కొందరు అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తే.
మరికొందరు ఆయా కార్లకు అత్యంత విలువైన నెంబర్ ప్లేట్ పెట్టుకుంటారు.అలా ప్రపంచంలోనే అత్యంత విలువైన కారు నెంబర్లుగా కొన్ని చరిత్రపుటల్లోకి ఎక్కాయి.
ఇంతకీ ఆ నెంబర్ ప్లేట్స్ ఎవరు కొనుగోలు చేశారు? ఏదేశంలో ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ప్రపంచంలో ఖరీదైన కార్లు నెంబర్ ఫ్లేట్ గా ఎఫ్1 అనుకుంటారు.కానీ అవి వాస్తవానికి తప్పు.D5 అనేది వరల్డ్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ నెంబర్ ప్లేట్.దీన్ని దుబాయ్ లోని ప్రముఖ వ్యాపారవేత్త బల్వీందర్ సింగ్ కొనుగోల చేశాడు.ఇండియాకు చెందిన ఇతడు.
ప్రస్తుతం
దుబాయ్
లో సెటిల్ అయ్యాడు.ఆ నెంబర్ ప్లేట్ ను ఆయన 33 మిలియన్ దినార్స్ కు కొనుగోలు చేశాడు.
ఇండియన్ కరెన్సీలో దాదాపు 67 కోట్ల రూపాయలు.ఇదేకాదు.
తను గతంలోనూ ఓ కాస్ట్లీ నెంబర్ ప్లేట్ తీసుకున్నాడు.అదేంటంటే 09. దీన్ని 51 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు.
ఇక F1 నెంబర్ ప్లేట్ విషయానికి వద్దాం.ఈ నెంబర్ ప్లేట్ విలువ 132 కోట్ల రూపాయలు.మరి D5 ఎలా ఖరీదైన నెంబర్ ప్లేట్ అవుతుందని మీకు అనుమానం రావచ్చు.
అయితే యుకె వాళ్లు ఈ నెంబర్ ప్లేట్ ను 132 కోట్లకి అమ్మకానికి పెట్టారు.సేల్ అనేది ఎంతకైనా పెట్టే అవకాశం ఉంది.వెయ్యి కోట్లకు కూడా పెట్టవచ్చు.కానీ ఎంతకు కొన్నాడు అనేదే మ్యాటర్.అంతేకాదు.F1 నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసినట్లు సమాచారం కూడా లేదు.ఇక రెండో అత్యంత ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అబుదాబిలో ఉంది.ఆ నెంబర్ 1. దీన్ని 2008లో 66 కోట్లకు కొన్నారు.