బల్లి మనుషులపై పడితే ఏమవుతుంది? ఏం చేయాలి?

బల్లి మనుషులపై పడగానే.దేనినీ తాకకుండా వెంటనే వెళ్లి తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలని చెబుతుంటారు.

అసలు బల్లి మనపై పడితే ఏమవుతుందో చూద్దాం.మనిషి శరీరంలోని ఓ భాగంపై బల్లి పడిందనే విషయంపైనే కాకుండా ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పడిందనేది కూడా ముఖ్యం.

కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగానూ కొన్ని సార్లు అశుభంగానూ భావిస్తారు.బల్లి మన శరీరంపై ఏభాగాన పడితే దానికి ఫలితమేమిటి అని తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉంది.

కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని నమ్మకం.అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు.

Advertisement
What Happens If The Lizard Falls On People, Lizard , Falls On Peopl , Head , Kam

కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడా ప్రజల్లో ఓ ప్రగాఢ నమ్మకముంది.మనమేదన్నా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు.

అది పలికి నపుడు "క్రిష్ణ క్రిష్ణ " అని అంటారు.చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

What Happens If The Lizard Falls On People, Lizard , Falls On Peopl , Head , Kam

ఇక బల్లిని విష పురుగుగా చెబుతుంటారు.బల్లి కరువకపోయినా, బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే దాన్ని విషాహారంగా చెబుతుంటారు.అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడు కానీ, మీద పాకుతూ వెళ్ళినప్పుడు లేదా మనల్ని తాకినప్పుడు భవిష్యత్తులో ప్రమాదమని పెద్దలు చెబుతుంటారు.

బల్లి మీద పడితే ఏమవుతుంది? బల్లి శరీరంపై పడితే ఏమవుతుందని చాలా మంది భయపడుతుంటారు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు