Ranjitha : రంజిత చేసిన తప్పు వల్లే ఆమె తల్లి ప్రాణం పోయిందా ?

నటి రంజిత( Actress Ranjitha ).

ఈమె పేరు చెప్తే తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు కానీ తమిళ్ లో మాత్రం ఆమెను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అలాగే ఆమె నిత్యానంద వల్ల అప్పట్లో బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది.ప్రస్తుతం ఆమె నిత్యానంద తోనే కైలాస దేశం లో స్థిరపడి పోయింది.

ఆమె ఒక్కతే కాదు ఆమె ఇద్దరు చెల్లెల్లు కూడా ఆమెతో పాటే ఉన్నారు.రంజిత సినిమాల్లో నటిస్తున్న టైం లో పూజలు, భక్తి అంటే ఏంటో తెలియదు.

పెళ్లి చేసుకొని భర్త తో పాటే అమెరికా( America ) వెళ్ళిపోయింది.కానీ ఆమె వీడియో ఒకటి అప్పట్లో నిత్యానంద స్వామి( Nithyananda Swami ) తో బయటకు రాగానే ఆమె భర్త రంజితకు విడాకులు ఇచ్చాడు.

Advertisement

ఆలా ఆమె ఆశ్రమానికి పరిమితం అయిపొయింది.కానీ రంజిత వ్యవహారం మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా ఫీల్ అయ్యిందో తెలియదు కానీ ఆమె తల్లి మాత్రం తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.ఆ తర్వాత వారం రోజులు కూడా గడవకుండానే రంజిత చేసిన పనికి అవమాన భారం తో కన్ను మూసింది.

ఇక రంజిత మరియు ఆమె చెల్లెల్లు ఇద్దరు నిత్యానంద ఆశ్రమం లో ఉండిపోవడం తో రంజిత తండ్రి భార్యను పోగొట్టుకొని ఒంటరిగానే ఉంటున్నారు.ఇటీవల కాలంలో ఒక మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తన ముగ్గురు కూతుళ్లు నిత్యానంద దగ్గర బలవంతంగా ఉంటున్నారని, తన పిల్లలను తనకు ఇచ్చేయాలని మోర పెట్టుకుంటున్నారు.

అయితే రంజిత తండ్రి కూడా సాదా సీదా వ్యక్తి ఏమి కాదు.అయన కూడా సినిమ ఇండస్ట్రీ కి చెందినవాడే.

ముగ్గురు కూతుళ్లను బాగా చదివించాడు.అలాగే పెళ్లిళ్లు కూడా చేసాడు.కానీ నిత్యానంద స్వామి వారి జీవితంలోకి ప్రవేశించగానే వారు భర్తలతో విడాకులు తీసుకొని ఇప్పుడు ఆశ్రమం లోనే ఉంటున్నారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

వారు ఒక విధమైన ట్రాన్స్ లో బ్రతుకుతూ తండ్రి గురించి కూడా ఆలోచించడం లేదు అని, ఈ ముసలి తనంలో తనకు పిల్లల అవసరం ఉంటుంది అని కూడా వారు గుర్తించక వారికి ఎలాంటి భవబంధాలు లేకుండా సన్యాసిని లుగా జీవిస్తున్నారని, తాను పెట్టిన పేర్లు కూడా మార్చుకొని పూర్తిగా నిత్యానంద స్వామి చెప్పినట్టే చేస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు