'రఘువీరా' రూటు ఎటు...? అడ్జస్ట్ అవుతారా ..? పార్టీ మారుతారా..?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి రాజకీయ పయనం ఎటు.? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా .

? కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని భావిస్తున్నారా.? అసలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ .? ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు.? అనే ప్రశ్నలు బయటకి వస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేస్తారా ? అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.బలమైన యాదవ సామజిక వర్గానికి చెందిన రఘవీరా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుదేలయినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూసారు.

అయితే ఏపీలో ఇప్పటికే చెప్పుకోదగ్గ బలమైన నాయకులు ఎవరూ కాంగ్రెస్ లో లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ మారకుండా అడ్డుకట్ట వేసింది.

అనంతపురం రాజకీయాల్లో రఘవీరా ప్రభావం ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంది.ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.2014 ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.ఉరవకొండ, కదిరి స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

కొంతకాలానికి చాంద్‌బాషా కూడా తెలుగుదేశం పార్టీలోచేరిపోయారు.దీంతో తెలుగుదేశం ఎమ్మెల్యేల బలం 13కు చేరితే.

Advertisement

వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు.టీడీపీ కి కంచుకోటలా మారిన ఈ జిల్లాలో ఎలా అయినా వైసీపీ జెండా ఎగురవేయించాలని చూస్తున్న జగన్ రగువీరకు అనేక ఆఫర్లతో గేలం వేస్తున్నాడు.

అయితే రఘవీరా మాత్రం ఎక్కడా తొందరపడకుండా మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నారు.

రఘువీరారెడ్డి గతంలో కల్యాణదుర్గం నియోజయవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.ఆ తర్వాత వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు.ఈ నేపథ్యంలోనే మళ్లీ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

దానికి అనుగుణంగానే ప్లాట్ ఫార్మ్ రెడీ చేసుకుంటున్నారు.గ్రామస్థాయిలోను పార్టీని బలోపేతం చేస్తున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఒకవేళ కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే.రఘువీరారెడ్డిని హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెద్దగా వర్కవుట్ కాకపోవడం.అలాగే టీడీపీ గాలి తగ్గడంతో పాటు ఫ్యాను పార్టీ గాలి బలంగా వీస్తుండడంతో .రఘువీరా ఆలోచనలో పడ్డారట.కాంగ్రెస్ లో ఉంటే పరిస్థితి ఏంటి.? వైసీపీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు రఘవీరా.

తాజా వార్తలు