హర్రర్ వీడియో: బోటుపై తిమింగళం అటాక్..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన అనేక సంఘటనల వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇందులో భాగంగానే తాజాగా అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం నీటిపై ప్రశాంతంగా వెళ్తున్న ఓ బోటు( Boat ) ఉన్నటువంటి గందరగోళానికి గురైంది.

దీనికి కారణం ఓ భారీ తిమింగలం.అవునండి ఓ భారి తిమింగలం( Whale ) ఉన్నటువంటి ఒక్కసారిగా సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓ బోటుపై దాడి చేసింది.

బోటుపై దాడి చేసే సమయంలో బోటు కాస్త నీటిలో అల్లాడిపోయింది.అమెరికా దేశంలోని న్యూ హాంప్ షేర్( New Hampshire ) వద్ద సముద్ర జనాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘనంగా సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా.

Advertisement

న్యూ హాంప్ షేర్ సముద్ర జలాల్లో ఇద్దరు వ్యక్తులు చేపలు వేట కోసం 23 అడుగుల పొడవున్న బోటుతో సముద్రంలోకి వెళ్లారు.అయితే అనుకోకుండా వారు వెళ్లిన బోటు దగ్గరికి ఓ భారీ తిమింగలం వచ్చి చేరింది.అయితే ఉన్నట్లుండి ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా బోటుపై ఎగిరి పడింది.

దీంతో ఏముంది.అంత భారీ బరువు ఉన్న తిమింగలం ఒక్కసారిగా బోటుపై పడడంతో దెబ్బకు ఆ బోటు నీటిలో పడిపోయింది.

ఆ బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఓ వ్యక్తి ముందుగానే సముద్రంలోకి( Sea ) దూకగా మరొకరు తిమింగలం చేసిన పనికి సముద్రంలో పడిపోయాడు మరో వ్యక్తి.ఈ ఘటన మొత్తాన్ని బోటుకు దగ్గరలో ఉన్న మరో బోటులోని వ్యక్తి వీడియో తీసి అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దాంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

అన్నా క్యాంటీన్ల వివాదం... అడ్డంగా బుక్ అయిన మెగా హీరో...మామూలు ట్రోల్ కాదుగా!
వైరల్ వీడియో : ఏంటి భయ్యా.. కార్ పార్కింగ్ కోసం ఇంత లొల్లి అవసరమా.?

ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తిమింగలం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సముద్రంలో పడిపోయిన బోటులోని ఇద్దరు వ్యక్తులను అక్కడ ఉన్నవారు కాపాడారు.ఈ ఘటనలో ఇటు మనుషులకి అటు తిమింగలానికి ఎటువంటి హాని జరగలేదు.ఇక అమెరికాలోని ఆ ప్రాంతంలో జూన్ నెల నుండి ఆగస్టు వరకు తిమింగలాల సంచారం ఎక్కువగా ఉంటుందని సమాచారం.

Advertisement

అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని అక్కడికొందరు అధికారులు తెలిపారు.ఈ వీడియో చూసిన చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు.భయ్యా.

మీకు ఇంకా భూమ్మీద బతికే క్షణాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయారు లేకపోతే అంత పెద్ద తిమింగలానికి ఆహారం అయిపోయేవారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు