గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చాం..: సీఎం జగన్

ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.

ముందుగా స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు.ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సేవలను అందిస్తున్నామన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామన్న సీఎం జగన్ ప్రతి గ్రామంలో అందుబాటులోకి విలేజ్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామని చెప్పారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పు తెచ్చామన్నారు.

లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు