మేము వ్యాపారం చేస్తున్నాం.. సర్వీస్ కాదు: సురేష్ బాబు కామెంట్స్ వైరల్?

సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన ప్రొడ్యూసర్ గా రామానాయుడు ఎంతో మంచి పేరు ఉంది.ఆయన మరణం తర్వాత సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అసలు ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేవి లేవని కేవలం మంచి సినిమా, చెడ్డ సినిమా అని మాత్రమే ఉన్నాయని సినీ నిర్మాత సురేష్ బాబు వివరించారు.

థియేటర్ వ్యాపారం ఒక్క ఎక్జిక్యూటివే మేనేజ్ చేసుకోవడం కష్టం అయిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.ఎందుకంటే మనం వేసిన సినిమాలకు ఎక్కువ అడ్వాన్సులు తీసుకుని వాళ్లకు తిరిగి చెల్లించలేక, అంటే ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో వాళ్లకు నష్టాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

నిజంగా ఒక వ్యాపారం బాగుంటే అసలు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు అని సురేష్ బాబు ప్రశ్నించారు.అలా ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ గా చేరి ఒక 10 థియేటర్స్ ని తీసుకున్నారని ఆయన అన్నారు.

Advertisement

వాళ్ళల్లో కొంత మంది ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటిని నాన్ ఏసీ నుంచి ఏసీకి మార్చారని ఆయన చెప్పారు.

తప్పకుండా తనకు 300 థియేటర్స్ ఉన్నపుడు తన సినిమా వచ్చినపుడు తన సినిమా వేసుకుంటా అని ఆయన వివరించారు.నిజం చెప్పాలంటే అందరూ వ్యాపారం చేస్తున్నారన్న ఆయన, ఇక్కడ ఎవరూ సర్వీస్ చేయడం లేదని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.తాను కూడా బిజినెస్ చేస్తున్నానని, అక్కడ పని చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, రెంట్ కట్టాలి.

టాక్స్ లు కట్టాలి.డబ్బులు రావాలి అంటూ ఆయన చెప్పారు.

వాళ్లకు ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వేసుకుంటారు.అంతే గానీ నమ్మకం లేకపోతే ఎలా వేసుకుంటారు అని ఆయన స్పష్టం చేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు