చీరాల వైసీపీలో వర్గపోరు.. మరోసారి ఆమంచి, కరణం మధ్య వార్..!!

బాపట్ల జిల్లా చీరాలలో మరోసారి వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.నాయకులు కరణం బలరాం, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు బయటపడింది.

ఇరువర్గాలకు చెందిన అనుచరుల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈ క్రమంలోనే ఆమంచి అనుచరుడు సత్యానంద్ పై కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

War Between Amanchi And Karanam Again In YCP..!!-చీరాల వైసీప

ఈ దాడిలో సత్యానంద్ కు తీవ్రగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం చీరాల ఆస్పత్రి దగ్గర మరోసారి రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు దాడికి యత్నించారు.

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisement
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

తాజా వార్తలు