ఈఐయూ (ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్)( Economist Intelligence Unit ) ఇవాళ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన, సుందరమైన నగరాల జాబితా విడుదల చేసింది.ఆరోగ్య సంరక్షణ, స్థిరత్వం, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణంతో సహా అనేక కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారనే విషయం అందరికీ తెలిసినదే.
ప్రతీ ఏటా ప్రకటించే గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ లో భాగంగా ఈ నగరాల పేర్లు వెల్లడించారు.ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల పేర్లున్న ఈ జాబితాలో భారత్ మాత్రం అట్టడుక్కి చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని ‘వియన్నా’ని( Vienna ) పేర్కొన్నారు.దాటి వియన్నా అగ్రస్ధానంలో నిలిచింది.
వియన్నా తర్వాత, డెన్మార్క్‌లోని ‘కోపెన్‌హాగన్’( Copenhagen ) రెండో స్ధానాన్ని మరోసారి నిలుపుకుంది.

అదేవిధంగా ఆస్ట్రేలియా నగరాలు అయినటువంటి మెల్‌బోర్న్,( Melbourne ) సిడ్నీ( Sydney ) ఈ జాబితాలో వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.ఇక కెనడాలోని ఏకంగా 3 నగరాలు ఈ జాబితాలో టాప్ 10లో సత్తాచాటాయి.వీటిలో వరుసగా కాల్గరీ, వాంకోవర్, టొరంటో ఉన్నాయి.
స్విస్ నగరాలు జ్యూరిచ్ ఆరవ స్థానంలో, జెనీవా కాల్గరీతో ఏడవ స్థానంలో నిలిచింది.అదేవిధంగా జపాన్‌లోని ‘ఒసాకా’ 10వ స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో భారత్ లోని ఐదు నగరాలకు చోటు దక్కింది.అయితే 173 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై అత్యంత పేలవ ర్యాంకులు తెచ్చుకోవడం సిగ్గుచేటు.

ఇక దేశరాజధాని న్యూఢిల్లీ, ముంబై 141వ స్థానంలో , చెన్నై 144వ స్థానంలో ఉన్నాయి.అహ్మదాబాద్, బెంగళూరు వరుసగా 147, 148 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.అయితే ఈ స్థానాలను చెప్పుకోవలసిన పనిలేదు గానీ చెప్పుకోక తప్పదు.ఇక యూకే రాజధాని అయినటువంటి లండన్, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ వరుసగా 12, 22 స్థానాలు దిగజారి 46వ, 43వ స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
డమాస్కస్ ఒక దశాబ్దానికి పైగా ఇండెక్స్‌లో అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోంది.యుద్ధం నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం కూడా అట్టడుగు స్ధానంలో నిలిచింది.