మెడను తెల్ల‌గా, ఆకర్షణీయంగా మార్చే వాల్ నట్స్..ఎలాగంటే?

వాల్ న‌ట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కాల్షియం, జింక్, ఇనుము, సెలీనియం, విటమిన్ ఇ, విట‌మిన్ బి, ప్రోటీన్, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో నిండి ఉంటాయి.

అందుకే ఇవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను అందిస్తాయి.

అయితే వాల్ న‌ట్స్ కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.సాధార‌ణంగా చాలా మంది త‌మ మెడ న‌ల్ల‌గా, అగ్లీగా ఉంద‌ని ఫీల్ అవుతూ ఉంటారు.

ఈ నేప‌థ్యంలోనే మెడ‌ను తెల్ల‌గా, ఆక‌ర్ష‌ణీయంగా మార్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతంటారు.అయితే అందుకు వాల్ న‌ట్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి వాల్ న‌ట్స్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు వాట‌ర్‌లో వాల్ న‌ట్స్‌ను గంట పాటు నాన బెట్టుకుని ఆ త‌ర్వాత పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్ది పెరుగు క‌లిపి మెడ‌కు ప‌ట్టించాలి.

Advertisement
Walnuts Help To Whitening Neck! Walnuts, Whitening Neck, Benefits Of Walnuts, Ne

బాగా డ్రై అయిన త‌ర్వాత న‌లుపుకుంటూ మెడ‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్ర‌మంగా మెల్ల వైట్‌గా, కాంతివంతంగా మారుతుంది.

Walnuts Help To Whitening Neck Walnuts, Whitening Neck, Benefits Of Walnuts, Ne

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వాల్ న‌ట్స్ పొడి, శెన‌గ పిండి మ‌రియు తేనె వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.

మెడ తెల్ల‌గా, మృదువుగా మారుతుంది.ఇక వాల్ న‌ట్స్ పొడి తీసుకుని అందులో బాగా పండిన అర‌టి పండు పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసుకుని.పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

అనంతరం కూల్ వాట‌ర్‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా.

Advertisement

మెడ తెల్ల‌గా, ఆకర్షణీయంగా మారుతుంది.

తాజా వార్తలు