అరగంట నడిస్తే లక్షన్నర ..

ఎక్కడా? ఎవరిస్తారు? వివరాలన్ని చెబితే ఇప్పుడే బయలుదేరి అరగంట నడిచొస్తాం అని ప్లాన్ వేస్తున్నారా! ఇక్కడ ఎవరు ఎలాంటి పోటి పెట్టలేదు.

అరగంట నడిస్తే లక్షన్నర ఇస్తామని ప్రకటించలేదు కూడా.

కాని రోజూ అరగంట నడిస్తే సంవత్సరానికి లక్షన్నర ఆదా చేయొచ్చు అంట.ఈ విషయాన్ని అమెరికా పరిశోధకులు చెప్పారు.మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎగేసుకోని బరువులు ఎత్తడం, అలసిపోయేంత వరకు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని, రోజూ ఓ అరగంట నడిస్తే చాలు, మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని, తద్వారా ఏడాదికి లక్షన్నరకు పైగా ఆదా చేయవచ్చు అని చెబుతున్నారు డాక్టర్లు.

Walking For Half Hour A Day Can Save 2500 Dollars American Survey Details, Walki

ఈ అదా చేయడం ఎలాగో అర్థం కాలేదా? మెడికల్ బిల్లులు తగ్గించడం ద్వారా.దాదాపు 26 వేలమందిపై ఓ సర్వే చేసిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సర్వే వివరాల్ని తన మ్యాగజీన్ లో వివరించింది.పూర్తి జనాభా మెడికల్ బిల్లులు ఏకంగా 68 బిలియన్ డాక్టర్లు దాటుతున్నాయని, ప్రతీ ఒక్కరు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వలన ఏడాదికి 2500 డాలర్లు (ఇండియన్ కరెన్సిలో 1.66 లక్షలు) అదా చేయవచ్చు అని మ్యాగజీన్ తెలిపింది.సర్వే లెక్కలు అమెరికా వరకే పరిమితమైనా, వాకింగ్ ఎక్కడ చేసినా, ఎవరు చేసినా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోని మెడికల్ బిల్లులు తగ్గించుకోవచ్చు కదా! మనదేశంలో మరీ అంతగా ఖర్చుపెట్టడం లేదేమో కాని, సరిగ్గా లెక్కపెడితే మన మెడికల్ బిల్లులు కూడా భారిగానే ఉంటాయి.

కార్తీక మాసంలోని చివరి సోమవారం.. మహా శివుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాల్సిందే..!
Advertisement

తాజా వార్తలు