మూడు రోజులుగా విఓఏల టోకెన్ సమ్మె

రాష్ట్ర ప్రభుత్వం విఓఏలతో వెట్టి చాకిరి చేయిస్తూ కనీసం వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని సీఐటీయు ఎంఆర్ఎస్కెవి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత మూడు రోజులుగా మిర్యాలగూడ మండల సమాఖ్య 1,2 పరిధిలో పనిచేసే 82 మంది విఓఏలు ఐకేపీ వీవోఏ కమిటీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె చేస్తున్నారు.

అందులో భాగంగా శనివారం మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా విఓఏల మండల అధ్యక్షురాలు కె.లక్ష్మి,ఉపాధ్యక్షులు శేఖర్ మాట్లడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాలలో స్వయం సహాయక సంఘాల పటిష్టతో పాటు సంఘ సభ్యులకు అన్ని విధాలుగా చేయూత నందిస్తూ,ఆర్థికంగా వెనుకబడిన మహిళలను బలోపేతం చేస్తూ ఎన్నో సేవలను అందిస్తున్న విఓఏలకు కనీసం వేతనం ఇవ్వాలని కోరారు.విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులతో పాటు డ్రెస్ కోడ్ ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో కూడా ఎంతో కస్టపడి పనిచేశామని, తమకు ఆరోగ్య భీమా అందించి,కరోనాతో మరణించిన విఓఏల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.సుమారు 54 యాప్ లతో ఆన్లైన్ లో వర్క్ చేయడం వలన ప్రభుత్వం ఇచ్చే వేతనం రీఛార్జ్ లకే సరిపోవడం లేదని,అర్హులైన విఓఏలను సీసీలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.

సుప్రీం కోర్ట్ తీర్పును అనుసరించి కనీస వేతనం 26 వేలు చేసి,వేతనాన్ని నేరుగా ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రకళ, కోశాధికారి బి.జాను, సంయుక్త కార్యదర్శి సుహాసిని,స్రవంతి, నాగలక్ష్మి,రేణుక, లక్ష్మీపార్వతి,శౌరమ్మ, వెంకటరమణ,వాల్య, యశోద,స్వాతి,మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

Latest Nalgonda News