విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఏర్పాటు చేస్తానన్న జగన్మోహన్రెడ్డి ప్రకటన తర్వాత ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వైసీపీ వాళ్ల ఇన్సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టే పనిలో ఉన్నారు.అమరావతిలో టీడీపీ వాళ్లు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలో జగన్ విశాఖను ఎందుకు ఎంపిక చేశారో చెబుతూ వైసీపీ వాళ్ల భూముల కొనుగోలు చిట్టాను బయటపెడుతున్నారు.
విశాఖపట్నంలో భూముల కొనుగోలు మొత్తాన్ని తాడేపల్లిలో జగన్ ఇంట్లో ఉండే విజయ్ అనే వ్యక్తి చూసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.ఇలా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే మధురవాడ, భోగాపురం ప్రాంతాల్లో ఆరు వేల ఎకరాల భూమిని వైసీపీ వాళ్లు కాజేసినట్లు ఆ పార్టీ చెబుతోంది.
జగన్‌కు సన్నిహితుడైన ఆడిటర్ లక్ష్మీనారాయణ.పద్మనాభం రోడ్లో వంద ఎకరాలు ఎందుకు కొనుక్కున్నారు? ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.సిరిపురంలోనూ ఇలాగే వంద ఎకరాల లేఔట్ ఉన్న మరో వ్యక్తి ఎవరు? విశాఖ నుంచి లూలూ సంస్థను తరిమేసి ఆ భూమిని ఓ క్రిస్టియన్ సంస్థకు ఇస్తున్నారు.ఇది కూడా ఇన్సైడర్ ట్రేడింగే కదా అని అధికార పక్షాన్ని నిలదీసింది.
అంతేకాదు వైఎస్ హయాంలో విశాఖలో జరిగిన భూకుంభకోణాలను కూడా మళ్లీ ప్రచారంలోకి తీసుకొస్తోంది.హనుమంతువాక నుంచి సింహాచలం వెళ్లే దారిలో ఎకరం 18 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని తమ బినామీలకు అప్పగించి, అవసరమే లేని 6 లేన్ల బీఆర్టీఎస్ రోడ్డును ప్రభుత్వ ధనంతో వేయించి ఆ భూమి విలువను ఎకరానికి రూ.40 కోట్లకు చేర్చుకున్నది నిజం కాదా?
విశాఖ ఐటీ హబ్ దగ్గర రూ.800 కోట్ల విలువ చేసే 43 ఎకరాల ప్రభుత్వ భూమిని సీబీఐ వాళ్లు ఎందుకు సీజ్ చేశారు? ధర్మానను బినామీగా పెట్టి మధురవాడ కొమ్మాది దగ్గర రూ.2 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను సీబీఐ తొమ్మిదేళ్ల పాటు సీజ్ చేస్తే.దానిని జగన్ మళ్లీ విడిపించుకున్నారు.
తగరపువలసకు 9 కిలోమీటర్ల దూరంలో 2500 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రానైట్ మైనింగ్ పేరిట బినామీలకు రాసిస్తే.దాన్ని కూడా సీబీఐ సీజ్ చేసింది అంటూ గతంలో విశాఖలో జగన్ చేసిన అక్రమాలను కూడా టీడీపీ బయటపెడుతోంది.