తెలంగాణా సీయం కేసీఆర్ తన మాట వినని వాళ్లకి అప్పుడప్పుడు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా.వారికి చిన్న చిన్న షాకులు ఇస్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు కేసీఆర్ కే షాక్ ఇచ్చారు మోడీ.మోడీ ఏంటి కేసీఆర్ కి షాక్ ఇవ్వడం ఏమిటి అని ఆలోచిస్తునారా.
వివరాలలోకి వెళ్తే
మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 28 న హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సందర్భంలోనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్ష నేతలతో కలిసి ప్రధాని మోడీని కలవాలి అనుకున్నారు.
ఈ భేటీలో కేసీఆర్ మోడితో రెండు ముఖ్యమైన విషయాల మీద మాట్లాడాలి అనుకున్నారు.వాటిలో ఒకటి “ఎస్ సి” వర్గీకరణ.
మరొకటి ”ముస్లింలకు రిజర్వేషన్లు”.కేసీఆర్ అసెంబ్లీలో ఈ రెండు అంశాలమీద ప్రతిపక్షానికి హామీ ఇస్తూ తాను ప్రధాని అప్పాయంట్ మెంట్ కోరతానని.
అఖిల పక్షనేతలను తీసుకెళ్తానని చెప్పారు.అందుకే ప్రధానికి ఒక వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నారు
అయితే కేసీఆర్ పెట్టుకున్న అభ్యర్ధనని ప్రధాని కార్యాలయం తిరస్కరించింది అని సమాచారం.
ప్రధాని ఆ రోజు చాలా కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని కలుసుకునేంత తీరికలేదని శనివారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమత్రి కార్యాలయానికి సమాచారం వచ్చిందని తెలిసింది.అయితే కేసీఆర్ ఇలా మోడీ ని అకిల పక్షంతో కలవాలని అనుకోవడం రెండో సారి.
ఇది ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేవిషయమే
ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి విజ్ఞప్తిని ప్రధాని తోసిపుచ్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.ఇందుకు కారణం బిజెపి ముస్లిం రిజర్వేషన్లని వ్యతిరేకించడం ఒక కారణం కావచ్చు.
బిజెపి నాయకులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అఖిల పక్షం అజెండాలో ముస్లిం రిజర్వేషన్లు విషయం హామీ ఉందని.ఇదే విషయాన్నీ గుర్తు చేసి అలెర్ట్ చేసి ఉంది ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.







