పేదలకు ఇళ్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!

ఏపీ రాష్ట్ర హైకోర్టు తాజాగా జగన్ ప్రభుత్వానికి పేదలకు సంబంధించిన ఇళ్ల పంపిణీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజనల్ బెంచ్.

 In Poor People House Scheme  Court Green Signal To Jagan Governament Ys Jagan,-TeluguStop.com

తాజాగా రద్దు చేయడం జరిగింది.గత నెల 8వ తారీకున ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయడం జరిగింది.

దీనిపై విచారణ చేపట్టిన డివిజినల్ బెంచ్ సింగల్ బెంచ్ తీర్పును కొట్టేయడం జరిగింది.మరోవైపు ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన 128 పిటిషన్లను పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు.

దీంతో డివిజనల్ ఇచ్చిన తీర్పుతో ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

పిటిషన్ లలో 52 మందికి ఇంతకు ముందే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.

అయితే పిటిషనర్ లు ఈ విషయాన్ని కోర్టు తెలియజేయలేదు.వాళ్లకు ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలనీ, లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని ఇంతకు ముందే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

దీంతో ఇళ్ల నిర్మాణానికి మొత్తం అడ్డంకులు తొలగినట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube