విరూపాక్ష రాక తో డీలా పడిపోయిన సమంత శాకుంతలం...

సాయి ధరమ్ తేజ(Sai dharam teja ) హీరో గా కార్తిక్ దండు( Karthik Varma Dandu ) డైరెక్షన్ లో వచ్చిన విరూపాక్ష వసూళ్ల సునామి ని సృష్టిస్తుందనే చెప్పాలి.

ఈ మూవీ కి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం ఇక ఎత్తు అయితే అది సూపర్ గా ఉండటం మరో ఎత్తు అయిందనే చెప్పాలి.

ఇక శని, ఆదివారం విరూపాక్ష సినిమా రఫ్ఫాడించింది.రిలీజైన శుక్రవారంతో పోలిస్తే, శని-ఆదివారాలు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఎక్కువగా కనిపించింది.

ఫలితంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష సినిమా.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ అటు ఇటుగా 17 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

మూవీకి నైజాం నుంచి ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.అటు ఓవర్సీస్ లో కూడా విరూపాక్ష హిట్టయింది, సాయితేజ్ కెరీర్ లో అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఓవర్సీస్ లో మొదటి వారాంతానికి 6 కోట్ల రూపాయల వసూళ్ల సాధించిన ఈ సినిమా, త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది.ఈ సినిమా రాకతో విడుదల పార్ట్-1, శాకుంతలం సినిమాలు దాదాపు వాష్ అవుట్ అయ్యాయి.

సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం( Shaakuntalam) సినిమా మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత ఫ్లాప్ అయింది.విరూపాక్ష రావడంతో మరో వీకెండ్ ఛాన్స్ లేకుండా పోయింది ఈ సినిమాకి.

అటు విడుదల పార్ట్-1 సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం పట్టించుకోలేదు.

విరూపాక్ష కొద్దిరోజులకే బ్రేక్ ఈవెన్ కూడా కానుందని తెలుస్తుంది.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ ఉన్న సిచ్వేశన్ కి ఆయనకి విరూపాక్ష రూపం లో ఒక మంచి హిట్ వచ్చిందనే చెప్పాలి.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు