వైరల్ వీడియో: తన వెనక కాళ్ళతో జీబ్రా సింహాన్ని ఏకంగా..?!

అడవిలోని జంతువులన్నీ సింహం నుంచి దూరంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే వేట అనేది సింహం స్వభావం.

సింహం అడవికి రాజు.అది కోరుకున్న చోటికి వెళ్లి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది.

అయితే, కొన్నిసార్లు మాత్రం సింహానికి వేటాడటానికి చాలా కష్టపడాల్సివస్తోంది.నిజానికి సింహం ఎంత బలంగా ఉన్నా కొన్నిసార్లు అది కూడా దెబ్బలు తినాల్సి ఉంటుంది.

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్‌ గా మారింది.ఈ వీడియోలో జీబ్రాను పట్టుకోవటానికి అడవి లోని ఓ సింహం వేగంగా పరిగెత్తడం గమనించవచ్చు.

Advertisement

అంతేకాదు జీబ్రా కూడా తన ప్రాణాలను కాపాడటానికి బాగా పరుగెడుతూ ఉంటుంది.అయినా కానీ సింహం జీబ్రాపై పంజా విసురుతుంది.

కరెక్ట్ గా అదే సమయంలో జీబ్రా తన వెనక రెండు కాళ్లతో సింహానికి ఒక్క కిక్ ఇచ్చింది.దాంతో జీబ్రా వెనకాల ఉన్న సింహం ఎగిరి ఎక్కడో పడుతుంది.

దీంతో జీబ్రా సమయస్ఫూర్తితో సింహానికి దొరకదు.ఇక ఇది ఇలా ఉండగా దీని తరువాత ఏం జరిగిందో వీడియోలో లేదు.

కాబట్టి జీబ్రా తప్పించుకోగలిగిందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం.ఈ వైరల్ వీడియోను వొవాఫ్రికా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియోకు చాలా కామెంట్స్, లైకులు రావడంతో వైరల్ గా మారింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

ఈ వీడియో చూసిన నెటిజన్స్.సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఏ జంతువైనా సింహం నుంచి తప్పించుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు