రాజస్థాన్‌లో దారుణం.. మంచంపై ఒంటెని కట్టేసి మహిళ చిందులు, వీడియో చూస్తే!

రాజస్థాన్‌లోని( Rajasthan ) హనుమాన్‌గఢ్‌లో జంతువులపై దారుణం వెలుగులోకి వచ్చింది.

వైరల్ వీడియోలో( Viral Video ) ఓ మహిళ తాళ్లతో కట్టేసిన ఒంటెపై( Camel ) ఎక్కి డాన్స్ చేసింది.

అది కూడా ఎండ మండిపోతుంటే, ఓ ఎత్తైన ప్లాట్‌ఫామ్ మీద ఆ ఒంటెను కట్టేశారు.కాళ్లు బంధించడంతో ఆ మూగజీవం కదలలేకపోయింది.

అది అక్కడే పడుకుని ఆ హింసను భరించింది.చుట్టూ జనం చూస్తుండిపోయారే కానీ ఎవ్వరూ ఆపలేదు.

"స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే" అనే జంతు సంరక్షణ సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది."ఇది సంప్రదాయం కాదు, ఇది సంస్కృతి కాదు, ఇది కేవలం క్రూరత్వం" అంటూ ఆ NGO ఘాటుగా విమర్శించింది.

Viral Video Of Woman Dancing Atop Tied Camel In Rajasthan Details, Animal Cruelt
Advertisement
Viral Video Of Woman Dancing Atop Tied Camel In Rajasthan Details, Animal Cruelt

చాలామంది జంతు ప్రేమికులు ఈ ఘటనపై మండిపడుతున్నారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మూగజీవాలను ఇలా వినోదం కోసం వాడుకోవడం దారుణమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని అంటున్నారు.

"పెటా" ( PETA ) లాంటి పెద్ద సంస్థలు కూడా స్పందించాయి.తప్పు చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Viral Video Of Woman Dancing Atop Tied Camel In Rajasthan Details, Animal Cruelt

సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."గుండె తరుక్కుపోయేలా ఉంది" అంటూ ఒకరు కామెంట్ చేస్తే, "ఈ కేసులో ఏం జరుగుతుందో అప్‌డేట్స్ ఇవ్వండి.నిందితులను అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నా" అని మరొకరు రాసుకొచ్చారు.

ఇంత జరుగుతున్నా, హనుమాన్‌గఢ్ అధికారులు మాత్రం ఇంకా దీనిపై అధికారికంగా స్పందించలేదు.ఈ షాకింగ్ ఘటన మరోసారి వినోదం పేరుతో జంతువులను హింసించడం అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది.

ఎండు రొయ్య‌లు వ‌ర్సెస్ ప‌చ్చి రొయ్య‌లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్‌?
ఇదేం వింత శవపేటిక.. స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు.. వైరల్ ఫొటో వెనుక అసలు కథ?

ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాలంటే, జంతు సంరక్షణ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు