వైరల్ వీడియో: గుర్రంతో పోటీపడుతూ ఆడుకుంటున్న మిస్టర్ కూల్..!

మహేంద్రసింగ్ ధోని ఆగస్టు 15, 2019న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో భాగమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇక సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వబోతున్నట్లు బీసీసీఐ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టీమిండియాకు ఎనలేని విజయాలను చేకూర్చిన కెప్టెన్స్ లో మహేంద్ర సింగ్ ధోనీ ముందంజలో ఉంటాడు.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రథసారథిగా వ్యవహరిస్తున్న ఎంఎస్ ధోని తన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయిస్తూ ఉన్నాడు.అయితే, కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఐపీఎల్ 14 సీజన్ మధ్యలోనే నిలిచిపోయిన సంగతి అందరికీ విధితమే.

ఇక అప్పటి నుంచి ఎంఎస్ ధోని రాంచి లోని తన ఫామ్‌ హౌజ్‌ లో కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేస్తున్నాడు.ఈ సందర్భంగా ఎంఎస్ ధోని తన ఫామ్‌ హౌజ్‌ లో ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవాలతో సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు.

Viral Video Cricketer Ms Dhoni Having Fun With Horse In Farm House , Ms Dhoni ,
Advertisement
Viral Video Cricketer Ms Dhoni Having Fun With Horse In Farm House , Ms Dhoni ,

ఇటీవల కాలంలో చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోని. తాజాగా మరోక చిన్న గుర్రంతో సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఈ వీడియో ఆధారంగా ఎం.ఎస్.ధోని ఆ చిన్న గుర్రంతో పాటు పరుగులు తీయడం మనం గమనించవచ్చు.ఈ వీడియోను మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో ఎంఎస్ ధోని అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసేయండి.

Advertisement

తాజా వార్తలు