వైరల్: ఆవుపై దాడిచేసిన కుక్క.. యజమాని ఏం చేసాడో తెలుసా?

సోషల్ మీడియా పెరగడంతో దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు చూసే వీలు చిక్కుతుంది.బేసిగ్గా కుక్కలు విశ్వాసానికి మారు పేరు అని చెబుతూ వుంటారు.

అయితే కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ ఉంటాయి.ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను కూడా చాలానే చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో చోటుచేసుకోగా తాజాగా వెలుగు చూసింది. పిట్‌ బుల్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది.

Advertisement

క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది.దీంతో ఆవు బాధతో నానాయాతన పడింది.

ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు.అయినా ఆ కుక్క మాట వినలేదు.

చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు.మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై మండిపడుతున్నారు.దాంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

కుక్క లైసెన్స్‌ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు.కుక్కను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆవును పశువైద్యశాలకు పంపించారు.

Advertisement

అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు.

తాజా వార్తలు