అక్కతో తమ్ముడు ప్రేమాయణం చివరికి...

ప్రేమ ఎప్పుడు ఎవరు మధ్య ఎలా చిగురిస్తుందో  చెప్పడం చాలా కష్టం.

అయితే తాజాగా వరసకి అక్క తమ్ముడు అయినటువంటి ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించి ఆ ప్రేమని  తమ పెద్దలు అంగీకరించరని తెలిసి కలిసి బ్రతక లేక పోయినా  కలిసి చావాలని నిర్ణయించుకు న్నారు ఓ ప్రేమ జంట.

ఇందులో భాగంగా ఇద్దరూ కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానిక జిల్లాలోని కులకచర్ల మండలంలోని ఓ  గ్రామానికి చెందినటువంటి మమత అనే యువతి స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుకుంటుంది.అయితే అదే ప్రాంతంలోనే ప్రశాంత్ అనే యువకుడు నినివసిస్తున్నాడు.

అయితే ఇతడు  స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అయితే వీరిద్దరూ వరసకి అక్కాతమ్ముళ్ల అవుతారు.

Advertisement
Vikarabad District Brother And Sister-అక్కతో తమ్ముడు

వయసులో ప్రశాంత్ కంటే ఒక సంవత్సరం పెద్దది అయినటువంటి మమత తన కంటే చిన్నవాడైన  ప్రశాంత్ ని ప్రేమించింది.దీంతో స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న ఇరువురు కుటుంబ పెద్దలు వీరిని హెచ్చరించారు.

Vikarabad District Brother And Sister

దీంతో ప్రశాంత్ కూడా ఉపాధి నిమిత్తమై హైదరాబాదు నగరానికి వచ్చి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు.అయితే ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా గుట్టుగా మమతతో ప్రేమాయణాన్ని  సాగించేవాడు.అయితే తాజాగా మమత తనని పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ ని కోరింది.

అయితే ఇలా చేస్తే కుటుంబ సభ్యులు తమని బ్రతక నివ్వరని అందుకే బ్రతికుండగా ఎలాగో ఇద్దరు కలిసి ఉండలేమని కనీసం చావులోనైనా ఒకరికొకరు తొండుందామని  ఇద్దరు కలిసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.ఇది గమనించిన స్థానికులు బాధితులను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా  ప్రశాంత్, మమత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు తిరుమల టు వాటి వివరాలను ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు