రాములమ్మా .. ఏమైందమ్మా  ? 

తెలంగాణ బిజెపి కీలక నాయకురాలు విజయశాంతి( BJP Leader Vijayashanthi ) అలియాస్ రాములమ్మ గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న గందరగోళం,  గ్రూపు రాజకీయాలకు అర్థం పడుతున్నాయి.

చాలాకాలంగా ఆమె పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఉంటున్నారు.

అంతేకాకుండా, కొంతమంది తనకు ఇష్టం లేని నాయకులకు కీలక పదవులను కట్టబెట్టడం  వంటివి విజయశాంతికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి .ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar redy )ని పార్టీలో చేర్చుకోవడం ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి విజయశాంతికి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి.

దైవాన్ని విశ్వసించే అంతఃకరణ, తరాల తెలంగాణ ప్రజల కష్టాలు చూసి చలించి ఉద్యమించే మనో ప్రేరణ రెండిటి సమాహారం.ఇది బహుశా తీవ్రమైన నా సంఘర్షణ భరిత 25 సంవత్సరాల రాజకీయ పయనం కావచ్చు.అయితే బిజెపి అంటే నేను విశ్వసించే అంతఃకరణ నమ్మకం .తెలంగాణ అంటే ఆ విశ్వాసం నమ్మకాలను మించిన నా ప్రజా ప్రయాణం కానట్లయితే , 2005 ల నేను బిజెపిని వదిలి తెలంగాణ ఉద్యమ బాట పట్టి ఉండకపోవచ్చు.బిజెపిపై ఎన్డీఏ భాగస్వామ్య ఒత్తిడి వల్ల నాడు ఆత్మగౌరవ తెలంగాణ ఒక్క అంశం కాకుంటే నేను 1998 నుంచి 2005 వరకు దేశమంతా పనిచేసి బిజెపి నాడు ఎందుకు దూరం చేసుకోవాల్సి వస్తద ? నేడు బిజెపి వ్యతిరేక మీడియా నా గురించి చెబుతున్నట్లు ఆ రెంటి మధ్య భవిష్యత్తు ఘర్షణ బహుశా వారి ఊహాగాన సృష్టిత అవాస్తవం అంటూ విజయశాంతి వ్యాఖ్యలు చేశారు .గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా( Social Media ) ద్వారా ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ సంచలనగా మారారు.

ఇటీవల తెలంగాణ కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) , తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది .అలాగే ఆ కార్యక్రమం నుంచి తాను ఎందుకు వచ్చేసాను అనే విషయాన్ని ప్రకటించారు.తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ వాదాన్ని ఉక్కు పాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవరైనా ఉంటే , అక్కడ ఉండడం తనకు అసౌకర్యం.

Advertisement

అసాధ్యమని విజయశాంతి ప్రస్తావించారు .పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేశారు.ఇక అప్పటి నుంచి ఏదో ఒక అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.

దీంతో ఆమె పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా ? అందుకే ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి .

Advertisement

తాజా వార్తలు