కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా మరి కొంతమంది నేతలు ఐదు రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు హామీలు ప్రకటిస్తూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందుతుందని ఈ నా మాటలు గుర్తుపెట్టుకోండి అని ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.

"కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఎప్పుడూ కూడా పేదలు మరియు అణగారిన వర్గాల కోసం పనిచేయలేదు.గత ఐదు సంవత్సరాలలో రాజస్థాన్ లో అద్వానమైన పాలన సాగింది.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి.

Advertisement

కర్ణాటక ప్రజలు( Karnataka ) ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి నిధులివ్వడంలో బిజీగా ఉంది.

కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఎప్పుడూ వెనుకబడిన రాష్ట్రంగానే ఉంది.కాంగ్రెస్ కుంభకోణాలు, దుష్పరిపాలన గురించి దేశ ప్రజలకు తెలుసు.

కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.అత్యంత అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ విభజించిందని, వారిని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.

ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కలలు కంటుంది" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?
Advertisement

తాజా వార్తలు