వైసీపీ మంత్రి విజయ్ సాయి రెడ్డి కి టిడిపి నేత బుద్దా వెంకన్నల మధ్య ట్విటర్ వార్ నడుస్తుంది.ప్రస్తుతం ఏపీ లో నడుస్తున్న ఏకైక హాట్ టాపిక్ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసం.
అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటున్నారు.మీ పార్టీ నాయకులే దాడులు చేస్తున్నారంటే మీరే చేసి మాపైన కేసులు పెడుతున్నారు అంటూ అక్కసు వెళ్లగకక్కుంటున్నారు.
ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి టిడిపి నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశాడు “మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం నీచానికి తెగబడుతోంది పచ్చపార్టీ.టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదారహరణ.

ఇది చాలు రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుకున్నవారెవరో చెప్పడానికి? సీసీ కెమెరా దృశ్యాలపై చంద్రన్న, అచ్చన్నా ఏమంటారు? అంటూ వీడియో తో సహా ఆయన పోస్ట్ చేశాడు ఓ ట్వీట్ చేశాడు మరో ట్వీట్ లో వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారు.ప్రజాధనాన్ని డెకాయిట్ల లాగా లూటీ చేసిన వారే ‘దొంగ దొంగ’ అని అరుస్తారు.గుళ్లు కూల్చిన వారే అపచారం…అపచారం అని గొంతు చించుకుంటారు.బాబు మార్క్ ఆఫ్ బ్యాంక్రప్ట్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి.అంటూ పోస్ట్ చేశాడు.విజయ్ సాయి రెడ్డి ట్వీట్ కి బుద్దా వెంకన్న గట్టి సమాదానమే ఇచ్చాడు “బాత్ రూం లో వేసేసిన వాళ్లే గుండెపోటు అని గగ్గోలు పెడతారు.
రాష్ట్రాన్ని దోచిన దండుపాళ్యం బ్యాచ్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని లెక్చర్లు దంచుతారు.విగ్రహాలు కూల్చమని కాంట్రాక్టు ఇచ్చిన కేటుగాళ్లే పంచకట్టి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటు కటింగ్ ఇస్తారు.
జగన్ రెడ్డి మార్క్ కన్నింగ్ పాలిటిక్స్ ఇలానే ఉంటాయి.అంటూ జగన్ కు ట్యాగ్ చేశాడు.