ఏపీలో మొన్నటి దాకా ఉద్యోగ సంఘాలనేతల ఆందోళనతో ఆపసోపాలు పడిన వైసీపీకి కర్నూలు జిల్లా ధోన్ నియోజకవర్గంలో నెలకొంటున్న కష్టాలతో సతమతమవుతోంది.ఇదీ ఏపీ ఆర్థికశాఖ మంత్రి, వైసీపీ కీలక నాయకుడు, ధోన్ నియోజకవర్గ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇలాక కావడం చర్చకు దారితీస్తోంది.
తన సొంత నియోజకవర్గంలోనే అయన వ్యతిరేక సెగను ఎదుర్కోవడం గమనార్హం.వైసీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో ఉంటున్నా సొంత క్యాడర్ నుంచే విమర్శలు రావడం గమనార్హం.
ఒకప్పడు కాంగ్రెస్‌కు కంచుకోటగా కర్నూలు జిల్లా ఉంది.2014-2019లోను ఆయన విజయం సాధించి రెండుసార్లు పదవులు చేజిక్కించుకున్నాడు.గత రెండు ఎన్నికల్లోనే బుగ్గన పరిస్థతి బాగానే ఉంది.ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే వైసీపీ యూటర్న్ తీసుకుంటందనే సంకేతాలు వెలువడుతున్నాయి.గత ఆరునెలలుగా స్థానికంగా రాజకీయ సెగను బుగ్గన్న ఎదుర్కొంటున్నాడు.గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పుంజుకుంటుందని గెలుపు తథ్యమని భావించారు.
కానీ, సీన్ రివర్స్ అయింది.టీడీపీ గెలవడం… టీడీపీ ఇనఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ధర్మారం సుబ్బారెడ్డి పార్టనీ పరుగులు పెట్టించడంతో వైసీపీ చతికలపడుతున్న పరిస్థితి నెలకొంది.
పార్టీలో నిత్యం జోష్ ఉండేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాడు.గ్రామస్థాయిలో టీడీపీని బలపరుస్తూ వైసీపీపై ప్రశ్నల అస్త్రాలు ఎక్కుపెడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.
ప్రభుత్వ అధినేత పిలుపు మేరకు నిరసనల జోరు కొనసాగిస్తూ వైసీపీని ఇబ్బందుల్లో పెడుతున్నాడు.
అయితే వైసీపీ అసమ్మతి నేతలు నేరుగాధర్మారం సుబ్బారెడ్డిని కొనియాడడం.టీడపీ జోష్ పెరుగుతుందని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీస్తోంది.అంతేకాకుండా మంత్రి తమను పట్టించుకోవట్లేదని, అందుబాటులో ఉండట్లేదని సాంత పార్టీ కేడర్‌లోనే చర్చ జరుగుతుందని సమాచారం.
ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో బుగ్గన గెలుపు ప్రశ్నార్థకమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా ధోన్‌లో వైసీపీ పరిస్థితులను బుగ్గన్న చక్కబెడతారా ? వైసీపీ దూకుడు పెంచి వచ్చే ఎన్నికల్లో గెలుపు పగ్గాలు చేపడతారా అన్నది వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.