చాలా చూశా, ఇక పీఎం అవ్వాలేమో అంటున్న రౌడీస్టార్‌

విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.మరికొన్ని గంటల్లో రౌడీ స్టార్‌ థియేటర్‌లో ప్రత్యక్షం కాబోతున్నాడు.

ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న సమయంలో ఒక జర్నలిస్ట్‌ మీ తర్వాత గోల్‌ ఏంటీ అంటూ ప్రశ్నించాడు.

అందుకు అందరు నవ్వుకునేలా సమాధానం ఇచ్చాడు.

తాను కెరీర్‌లో ఇప్పటికే చాలా చూశాను.ఇక దేశానికి పీఎం అవ్వాలేమో అన్నాడు.అదే గొప్ప విషయం కదా అంటూ రౌడీ సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చాడు.

Advertisement

రౌడీ సమాధానంకు అంతా నవ్వుకున్నారు.విజయ్‌ దేవరకొండ మాట్లాడే మాటలు చాలా సింపుల్‌గా ఉంటాయి.

ఆయన ఏదో సెలబ్రెటీ మాట్లాడినట్లుగా కాకుండా మనం పక్క వారితో మాట్లాడినట్లుగా మాట్లాడుతాడు.సినిమాల్లో ఆయన డైలాగ్స్‌ కూడా అలాగే ఉంటాయి కనుకే ఆయన్ను అంతగా అభిమానిస్తున్నారు.

యూత్‌ ఆడియన్స్‌లో యమ క్రేజ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు.లైగర్‌ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.సమ్మర్‌లోనే ఆ సినిమాను విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు.

మొన్నటి వరకు ముంబయిలో షూటింగ్‌ జరిపారు.వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పూర్తి అయిన వెంటనే ఈనెల చివర్లో మళ్లీ కొత్త షెడ్యూల్‌కు పూరి ప్లాన్‌ చేస్తున్నాడు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు