పెళ్లి తర్వాత గొడవలు 'ఖుషి'... కొత్తదనం ఏముంది భయ్యా?

విజయ్ దేవరకొండ ( vijay devarakonda )హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాన ( Shiva Nirvana )దర్శకత్వం లో రూపొందుతున్న ఖుషి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

సినిమా ను సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత మరియు విజయ్ దేవరకొండ పాల్గొంటున్నారు.

శివ నిర్వాన గతంలో రూపొందించిన సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కొందరు నమ్ముతున్నారు.అయితే కొందరు మాత్రం ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా ను ఇతర సినిమా లతో పోల్చుతూ విమర్శిస్తున్నారు.

ఖుషి సినిమా ( Kushi movie )గతంలో వచ్చిన పెళ్లి తర్వాత గొడవల సినిమాల మాదిరిగానే ఉండబోతుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

పెళ్లి తర్వాత గొడవలు పడే భార్య భర్తల కథ తో చాలా సినిమా లే వచ్చాయి.కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్‌ మీడియాలో ఈ సినిమా కు మెజార్టీ గా పాజిటివ్‌ టాక్ వినిపిస్తుంది.

విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని పెంచే విధంగా మరింత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది. శివ నిర్వాన ఈ రొటీన్‌ కాన్సెప్ట్‌ ను తప్పకుండా మంచి కథ తో రూపొందించి ఉండి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత మరియు విజయ్ దేవరకొండ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇది సమంత ఇచ్చిన కథ అంటూ కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు