వీడియో: ఈ గున్నఏనుగులు ఎలా కొట్టుకున్నాయో చూస్తే..!

సాధారణంగా చిన్న జంతువులు పోట్లాడితేనే భీకరమైన వాతావరణం నెలకొంటుంది.అలాంటిది రెండు గున్న ఏనుగులు ఒకదానికొకటి పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

తాజాగా ఇప్పుడు అలాంటి ఓ సంఘటన జరిగింది.అయితే ఇవి నిజంగా కొట్టుకోలేదు.

సరదాగా ఆడుకుంటూ పోరాడాయి.అందులోనూ ఇవి పెద్ద ఏనుగులేం కాదు.

ఇవి కుర్ర వయసులో ఉన్న చిన్న ఏనుగులే.కెన్యా దేశంలోని షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ సంరక్షణలో ఈ ఏనుగులను పెంచుతున్నారు.

Advertisement

వీటికి మక్తావో, కియోంబో అని పేర్లు పెట్టారు.ఇవి రెండూ కూడా అనాధ ఏనుగు లేనట.

అయినప్పటికీ ఏ చీకూ చింతా లేకుండా రెండు కలిసి ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఇవి మరో పెద్ద ఏనుగు సమక్షంలో ఆడుకుంటూ కనిపించాయి.

పిల్లులు, కుక్కల వలె ఇవి గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో sheldricktrust అనే పేజీ షేర్ చేసింది.

ఈ వీడియోకి ఇప్పటికే 30 వేలకు పైగా లైకులు వచ్చాయి."మక్తావో, కియోంబో చాలా ప్రశాంతమైన ఏనుగులు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అయినప్పటికీ, వారి నానీ క్వాంజా వారి ఆటను విడదీయాలని నిర్ణయించుకుంది" అని sheldricktrust పేజీ క్యాప్షన్ జోడించింది.సాధారణంగా వేర్వేరు తల్లులకు పుట్టిన ఏనుగులు అంత స్నేహపూర్వకంగా ఉండవు.

Advertisement

ఎప్పుడూ తల పడుతూనే ఉంటాయి.కానీ షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ సంరక్షణలో పెరుగుతున్న ఏనుగుల పిల్లలు మాత్రం ఫ్రెండ్లీగా మెలుగుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

అక్కడే ఉన్న మరికొన్ని ఏనుగులు కూడా ఈ పిల్ల ఏనుగులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి.షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఏనుగులకు సంబంధించిన చాలా వీడియోలు, ఫోటోలు కనిపిస్తాయి.

జంతు ప్రేమికులు ఈ పేజీని ఫాలో అవుతుంటారు.ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

తాజా వార్తలు