వీడియో: డెలివరీ బాయ్ స్కూటర్‌పై విరిగిపడ్డ భారీ చెట్టు.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న వైనం!

మహారాష్ట్రలోని విరార్‌ సిటీలో( Virar city, Maharashtra ) శనివారం (మార్చి 29) రాత్రి జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో, అగాషి చాల్‌పేత్‌లోని మహారాష్ట్ర బ్యాంక్ ( Maharashtra Bank )దగ్గర ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై వెళ్తున్నాడు.

ఇంతలో ఊహించని విధంగా ఓ భారీ చెట్టు అతని స్కూటర్‌పై కూలింది.

అయితే, ఆ డెలివరీ బాయ్ అదృష్టం మామూలుగా లేదు.చివరి క్షణంలో చెట్టు పడటాన్ని గమనించి మెరుపు వేగంతో స్కూటర్‌ను ముందుకు పోనిచ్చాడు.అంతే, వెంట్రుక వాసిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ఆ చెట్టు అతడిపై పడి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది.కానీ, అతనికి పెద్దగా గాయాలు కాలేదు.

ఈ అద్భుత ఘట్టమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు.

Video Delivery Boy Narrowly Escapes A Huge Tree Falling On His Scooter, Virar Tr
Advertisement
Video Delivery Boy Narrowly Escapes A Huge Tree Falling On His Scooter, Virar Tr

మరోవైపు పాల్ఘర్ జిల్లాలో ( Palghar district )విషాదం చోటుచేసుకుంది.ఆదివారం (మార్చి 30) నాడు బేస్ ఆయిల్స్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి, ముంబై-గుజరాత్ మార్గంలోని మనోర్ జంక్షన్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి కిందనున్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది.జర్నలిస్ట్ విశాల్ సింగ్ షేర్ చేసిన వీడియోలో ఈ భయానక దృశ్యాలు కనిపించాయి.

భారీ ట్యాంకర్ పైనుంచి కింద పడుతుంటే, సర్వీస్ రోడ్డుపై ఉన్న జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.అదృష్టవశాత్తు కింద ఉన్నవాళ్లు తృటిలో తప్పించుకున్నారు.

Video Delivery Boy Narrowly Escapes A Huge Tree Falling On His Scooter, Virar Tr

కానీ, ట్యాంకర్ డ్రైవర్ ఆశిష్ కుమార్ యాదవ్( Ashish Kumar Yadav ) (29) మాత్రం అంత అదృష్టవంతుడు కాదు.ప్రమాదం జరిగిన తీవ్రతకు అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఈ దుర్ఘటనతో వందలాది లీటర్ల చిక్కటి నల్లటి నూనె రోడ్డుపై అంతా ఒలికిపోయింది.

అయితే, దీనివల్ల మరో ప్రమాదం జరగలేదని తెలిసింది.ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!
Advertisement

తాజా వార్తలు