వీడియో: ట్రైన్ ముందు సెల్ఫీకి ఫోజులిచ్చిన మహిళ.. దాదాపు చెయ్యి కోల్పోయే పని అయింది..

కదులుతున్న వెహికల్స్‌ పక్కన సెల్ఫీలు అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే అవి పక్కనుంచి వచ్చి డ్యాష్ ఇచ్చే ప్రమాదం ఉంది.

సెల్ఫీ తీసుకోవాలనుకునే శ్రద్ధలో వెహికల్స్ తమకు దగ్గరగా వస్తున్నాయని చాలామంది చూసుకోరు.ఈ మధ్యకాలంలో రైలు పట్టాలపై నిలుచుని, వేగంగా వస్తున్న ట్రైన్‌లతో సెల్ఫీలు దిగడం ఒక ట్రెండ్‌గా మారింది.

రైళ్ల పక్కన ఫోటోలు దిగాలనే మోజు వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలను కోల్పోయారు.ఇది ప్రమాదకరమని తెలిసినా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు దీనిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు.

తాజాగా టర్కీ దేశం( Turkey ), అదానా సిటీలో కూడా కొంతమంది మహిళలు ట్రైన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు.పోజాంటీ జిల్లాలోని బెలెమెడిక్ నేచర్ పార్క్‌లో( Belmedic Nature Park ) వీరు సెల్ఫీ కోసం పోజులిచ్చారు.ఈ క్రమంలోనే ట్రైన్‌ ఓ మహిళ చేతిని బలంగా ఢీ కొట్టింది.

Advertisement

దాంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది ఓపెన్ చేస్తే మనకు రైల్వే ట్రాక్‌ల దగ్గర కొందరు మహిళలు ఫొటోలు దిగుతుండటం కనిపించింది.ఒక మహిళ ట్రైన్ కి ఎదురుగా థంబ్స్-అప్ సైన్ చేస్తూ, నవ్వుతూ ఫోటోలకి ఫోజు ఇచ్చింది.

అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రైన్ ఆ మహిళ చేతిని ఢీ కొట్టింది.చూస్తుంటే ఆమె చేయి విరిగిపోయిందేమో అనిపించింది, కానీ లక్కీగా సదరు మహిళకు పెద్దగా గాయాలు కాలేదు.

అయితే ఆ మహిళ చేతికి బాగా నొప్పి కలిగినట్లు సమాచారం.తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా విరిగిన ఎముకలు ఏమీ లేవని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.అదృష్టం కొద్దీ ఆమె ఈ ఘటన నుంచి ఎలాగోలా తప్పించుకోగలిగింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

మళ్లీ ఇలాంటి పిచ్చి పని ఆమె ఎప్పటికీ చేయదని చెప్పుకోవచ్చు.ఈ వీడియో చూసిన చాలామంది ఆ మహిళలను తిట్టిపోస్తున్నారు.

Advertisement

సెల్ఫీల వల్ల వచ్చేదేమీ లేదని, ఇలాంటి ఫోటోల కోసం విలువైన ప్రాణాన్ని పోగొట్టుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చివాట్లు పెడుతున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

తాజా వార్తలు