Leelavathi : ప్రతి నెలా పేదలకు వేల రూపాయల సహాయం.. 600 సినిమాలు.. లీలావతి మంచి మనస్సుకు గ్రేట్ అనాల్సిందే!

తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి లీలావతి ( Leelavathi )కన్ను మూశారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తాజాగా శుక్రవారం రోజు తుది శ్వాస విడిచారు.86 ఏళ్ల నీలావతి దాదాపు 56 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసింది.సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలను కూడా అందించింది.

రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ వంటి దిగ్గజ నటులతో నటించి మెప్పించారు.కేవలం కన్నడలో మాత్రమే కాకుండా సహా తెలుగు, తమిళ భాషల్లో( Kollywood ) మొత్తం 600 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది లీలావతి.

అలాగే ఆమె మరణ వార్త విన్న అభిమానులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కాగా సుమలత, శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్, దర్శన్, అభిషేక్ అంబరీష్, అర్జున్ సర్జా, డి.కె.శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah )తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు లీలావతి మరణంపై సంతాపం తెలియజేశారు.ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.సినిమాలతోనే కాదు సామాజిక సేవతోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు లీలావతి.2022 లో తన సొంత ఖర్చుతో సోలదేవనహళ్లిలో ఆసుపత్రిని నిర్మించారు.అంతే కాదు పేద కళాకారులకు కూడా సాయం చేశారు.

కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులకు నటి లీలావతి ప్రతినెలా డబ్బు ఇస్తోంది.దీంతో కష్టాల్లో ఉన్న కళాకారులకు సాయం అందుతోంది.మేం ముఖానకి మేకప్‌ వేసుకుంటనే పూట గడుస్తుంది.

Advertisement

అయితే కరోనా తర్వాత మాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.చాలా మంది కళాకారులు ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న నటి లీలావతి మాకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు అని లీలావతి సాయం పొందిన కళాకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.అలా ఆమె ఎంతోమందికి సహాయం చేసి గొప్ప మనసును చాటుకుంది.

ఇక లీలావతి కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు