బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. కష్టమంటూ?

బిగ్ బాస్( Bigg Boss ) విన్నర్ పల్లవి ప్రశాంత్ ( Pallavi  Prashanth )పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ తన ఆటతీరుతో అందరిని మెప్పించే చివరికి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచారు.

అయితే ఈయన విజేతగా నిలిచిన ఆనందం ఎక్కువ రోజులు లేదనే చెప్పాలి.గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున కంటెస్టెంట్లు అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు.

అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి పోలీస్ వారు కంటెస్టెంట్లు ర్యాలీ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోవాలని సూచించారు.

ఈ విధంగా పోలీసులు అందరిని వేడుకున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ మాత్రం కాస్త రాంగ్ స్టెప్ వేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు అంతేకాకుండా ఈయన అభిమానులు కూడా అత్యుత్సాహం కనబరుస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.దీంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేసి రెండు రోజులపాటు జైల్లో వేశారు అనంతరం కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇక ఈ విషయంపై తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి ( Venuswami ) మాట్లాడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

పల్లవి ప్రశాంత్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ ఎంతో స్ట్రిట్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ జోయల్ డేవిస్ చాలా పద్ధతిగా పల్లవి ప్రశాంత్ కు ర్యాలీ చేయకుండా వెళ్ళిపోవాలని సూచించారు కానీ వినకుండా ర్యాలీ చేశారు.దాని వలన హీరో కావాల్సిన వాడు జీరో అయ్యాడు.ఫేమ్ మొత్తం పోయింది.

 ఫేమ్ తెచ్చుకోవడం ఈజీ నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటూ వేణు స్వామి తెలిపారు.అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఈజీ కాపాడుకోవడం, మంచి జీవితం కష్టం.

డబ్బులు సంపాదించడం ఈజీ.విలువలు వదిలేస్తే డబ్బులు సంపాదించవచ్చు.కానీ నిలబెట్టుకోవడం కష్టమని తెలిపారు పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి గుర్తింపు సంపాదించుకోగా ఆ గుర్తింపును నిలబెట్టుకోలేకపోయారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు