ట్రెండ్‌కు తగ్గట్లు మారడంలో తప్పులేదన్న వెంకీమామ

సీనియర్ హీరోలు ప్రస్తుత యంగ్‌ హీరోలకు పోటీ ఎందుకు ఇవ్వలేక పోతున్నారు అంటూ కొందరిని ప్రశ్నిస్తే వారు ట్రెండ్‌ కు తగ్గట్లుగా సినిమాలు చేయడంలో విఫలం అవుతున్నారు.

ఈ తరం యువకులను వారు అంచనా వేయలేక కథల ఎంపిక విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్నారు.

అందుకే తెలుగులో స్టార్‌ హీరోలుగా పేరున్న వారు కొందరు పెద్దగా ఆధరణ దక్కించుకోలేని సినిమాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.అందుకే ట్రెండ్‌ కు తగ్గట్లుగా సినిమా లు తీయాలని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండ్‌ కు తగ్గట్లుగా నడవాలని అలా నడవకుంటే ఖచ్చితంగా వెనుక పడిపోతాం అంటూ తాజాగా సీనియర్ స్టార్‌ హీరో వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

Venkatesh Want To Do Ott Movie Or Web Series , Flim News, Narappa, Venkatesh, Ve

ఈయన నటించిన నారప్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.థియేటర్లు లేని కారణంగా ఓటీటీ ద్వారా నారప్ప ను విడుదల చేస్తున్నారు.ఈ వారంలో విడుదల కాబోతున్న నారప్ప సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వెంకటేష్ పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

Advertisement
Venkatesh Want To Do Ott Movie Or Web Series , Flim News, Narappa, Venkatesh, Ve

సీనియర్‌ హీరోలు కొందరు వెబ్‌ సిరీస్ లు చేస్తామని అంటున్నారు.ఇప్పటికే నాగార్జున వెబ్‌ సిరీస్ పనులు మొదలు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు.మరో వైపు వెంకటేష్‌ కూడా వెబ్‌ సిరీస్ లు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు.

మంచి సబ్జెక్ట్‌ వస్తే అది వెబ్‌ సిరీస్ కు బాగుంటుందని అనుకుంటే ఖచ్చితంగా నేను నటించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ప్రకటించాడు.ట్రెండ్‌ కు తగ్గట్లుగా మార్పు చెందడంలో తప్పే లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ లెక్కన చూస్తే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో వెంకీ మామ కూడా ఓటీటీ పై సందడి చేయడం ఖయాం అంటున్నారు.ఇక తన 75 సినిమా విషయమై ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరగడం లేదని పేర్కొన్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు