మీ ఇంట్లో ఈ వస్తువులను తప్పుదిశలో ఉంచుతున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదని దాదాపు చాలా మంది ప్రజలు నమ్ముతారు.

ఎటువంటి వాస్తు దోషం లేని గృహాలు ఎల్లప్పుడూ ఆనందం, సానుకూల శక్తి, సంతోషం మరియు శాంతిని కలిగి ఉంటాయి అని ప్రజలు నమ్ముతారు.

అయితే వాస్తుకి విరుద్ధంగా వాస్తు దోషం లేదా ఏదైనా వస్తువులను తప్పుదిశలో ఇంట్లో ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల శక్తి ఉంటుంది.

Vastu Tips To Remove Health Problems In Home,home,vastu Tips,home Vastu,astrolog

వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం కారణంగా ఒక వ్యక్తి మనసులో ప్రతికూల భావన తలెత్తుతుంది.అంతేకాదు ఆ ఇంట్లో వ్యక్తులు తరచూ అనారోగ్యానికి గురవుతారు.హిందూ మతంలో విగ్రహాదారణకు విశేష ప్రాధాన్యత ఉంది.

వాస్తు ప్రకారం ఒక ఇంట్లో విరిగిన దేవతా విగ్రహం లేదా చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు లేదా దెబ్బతిన్నా బొమ్మ ఉంటే వెంటనే వీటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది.వీటిని ఇంటి బయట పవిత్ర స్థలంలో ఉంచడం మంచిది.

Advertisement
Vastu Tips To Remove Health Problems In Home,Home,Vastu Tips,Home Vastu,Astrolog

హిందూమతంలో విరిగిన లేదా పగిలిన విగ్రహాన్ని పూజించడం మంచిది కాదు.వాస్తు ప్రకారం పగిలిన విగ్రహాలను పూజించడం నిషేధించబడింది.

ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.అటువంటి పరిస్థితులలో ఇంట్లో విరిగిన విగ్రహం లేదా బొమ్మ ఉంటే నదిలో నిమర్జనం చేయడం మంచిది.

Vastu Tips To Remove Health Problems In Home,home,vastu Tips,home Vastu,astrolog

ఇంకా చెప్పాలంటే వాస్తు ప్రకారం పచ్చని మొక్కలను ఇళ్లలో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రభావం ఉంటుంది.కానీ ఇంటి లోపల ఎప్పుడైనా ఎండిపోయిన మొక్కలు లేదా చాలా ముళ్ళు ఉన్న మొక్కలను అసలు పెంచకూడదు.ఇలా చేయడం వల్ల ఒత్తిడి, రోగాలు పెరుగుతాయి.

ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు గుడి అసలు ఉండకూడదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు