శ్రీవారి భక్తులకు శుభవార్త.. నడిచొచ్చే వారికి కూడా దివ్య దర్శనం టోకెన్లు..

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.భక్తులకు మరింత త్వరగా స్వామి వారి దర్శనం అయ్యేలా నడకదారిలో వెళ్లే భక్తులకు కూడా దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 Divya Darshan Tokens For Walkway Devotees Soon Says Ttd Eo Dharma Rao Meeting,tt-TeluguStop.com

అలిపిరి, శ్రీవారి మెట్టు, నడక మార్గాల్లో వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను జారీ చేయనుంది.నడకమర్గాలలో వచ్చే భక్తులలో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించామని, కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని అది అందుబాటులోకి వచ్చాక టోకెన్ల జారీ మొదలు పెడతామని ఈవో వెల్లడించారు.ఇక శ్రీవారి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమల లోని ఎస్ఎన్జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు శుక్రవారం స్థానిక అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు.

ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఈవో టీటీడీ తీసుకురానున్న సంస్కరణల గురించి మాట్లాడారు.ఏప్రిల్ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వీటిని ధర్మరథం బసుల స్థానంలో ఉపయోగిస్తామని ఈవో వెల్లడించారు.తిరుమలలో గదుల కేటాయింపు, విచారణ కేంద్రాల్లో రాగి బాటిల్ ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


అంతేకాకుండా తిరుమల లో మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

కొత్త విధానం ద్వారా దళారుల బెడద తప్పిందని తెలిపారు.గదుల రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని వెల్లడించారు.

ఈ విధానంలో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube