కంచే స్టోరి కాపి కొట్టరా ?

హాలివుడ్ సినిమాలు చూడటం, వాటిల్లోంచి సన్నివేశాలు ఏరుకోవడం, కుదిరితే స్టోరి మొత్తం లేపేయడం మన దర్శకులకి కొత్తేమి కాదు.

ఒకప్పుడంటే మన ప్రేక్షకులు తెలుగు సినిమా తప్ప ఏది చూసేవారు కాదు.

మన దర్శకులు ఎక్కడి నుంచి కాపి కొట్టినా పెద్దగా తెలిసేది కాదు.ఒకవేళ తెలిసిన దాన్ని ఎవరికీ చెప్పాలి.

ఇప్పుడు అలా కాదు, ఇంగ్లీష్ భాష మీద కాస్తో కూస్తో పట్టున్న ప్రతి ఒక్కరు హాలివుడ్ సినిమాలు చూస్తున్నారు.ఎవరు ఏం కాపి కొట్టినా వెంటనే కనిపెట్టేసి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టేస్తున్నారు.

ఇంతా జరుగుతున్నా మన దర్శకులు మాత్రం మారట్లేదు.ఒక్కరు ఇద్దరు అని కాదు, సుకుమార్ లాంటి వారు మినహా దాదాపు అందరు ఎదో ఒక హాలివుడ్ సినిమాని అటు మార్చి ఇటు మార్చి తీసేవారే.

Advertisement

ఇప్పుడు కంచే కుడా కాపి కావచ్చు అనే పుకారు వినిపిస్తోంది.ట్రైలర్ ని బట్టి చుస్తే 2010 లో వచ్చిన ఇంగ్లిష్ చిత్రం " డియర్ జాన్ " ఛాయలు కనిపిస్తున్నాయి.

సినిమా మొత్తం చూడకుండా అప్పుడే కాపి అనడం తప్పే కాని, ట్రైలర్ మట్టుకు ఆ చిత్ర కథతో పోలి ఉండటం అనుమానానికి తావు ఇస్తోంది."డియర్ జాన్" సినిమా కుడా ఒక నవల నుంచి కథ కావడం విశేషం.

కంచే ఎంతవరకు ఒరిజినల్ సినిమానో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు