చాలా రోజులకు బయటకు వచ్చిన వంగవీటి, బాబు నివాసానికి వెళ్లి

ఏపీ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలపాలని చూస్తున్న టీడీపీ నేతలకు అక్కడి ప్రభుత్వం గట్టి ఝలక్ ఇస్తుంది.

ఏపీ కి మూడు రాజధానులు పెట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం తో పలువురు టీడీపీ నేతలు నిరసనకు దిగడం తో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు.ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను కూడా బుధవారం రాత్రి విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఉండవల్లి లోని బాబు నివాసం దగ్గర మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రత్యక్షమవ్వడం ఆశ్చర్యం కలిగింది.ఎన్నికలకు ముందు వైసీపీ కి రాజీనామా చేసిన వంగవీటి బాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత పెద్దగా పార్టీ తో కనిపించని వంగవీటి ఇప్పుడు తాజాగా బాబు నివాసం వద్ద ప్రత్యక్షమవ్వడం టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యం కలిగించింది.

అమరావతి పరిరక్షణ సమితి యాత్రను ప్రారంభించేందుకు వెళ్లగా.పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

చంద్రబాబును బలవంతంగా బస్సులోకి ఎక్కించడంతో యుద్ధవాతావరణం కనిపించింది.బాబును అక్కడి నుంచి తరలించి ఉండవల్లిలోని నివాసంలో వదిలేశారు.

చంద్రబాబు అరెస్ట్ గురించి తెలుసుకున్న వంగవీటి ఆయనను కలవడం కోసం అని నేరుగా ఉండవల్లి లోని ఆయన నివాసానికి వెళ్లారు.అక్కడ మాజీ మంత్రి లోకేష్‌తో పాటూ టీడీపీ నేతల్ని కలిశారు.

తాజా రాజకీయా పరిణామాలపై కొద్దిసేపు మాట్లాడిన ఆయన రాధా తన సంఘీభావాన్ని తెలిపారు.కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన, మళ్లీ చంద్రబాబు ఇంటికి రావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూశారు.

రాధా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం కూడా మొదలయ్యింది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు