నా ఫోటోలను ఎడిట్ చేసి పెడుతున్నారు...బేబీ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!

వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ ఛానల్  వీడియోలు చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అయ్యారు నటి వైష్ణవి చైతన్య ( Vaishanavi Chaitanya ) .

ఇక ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

కెరీర్ మొదట్లో ఈమె పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన అనంతరం హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు.బేబీ సినిమా(Baby Movie) ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా మంచి విజయం కావడంతో తదుపరి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇక త్వరలోనే దిల్ రాజు ( Dil raju )వారసుడు ఆశిష్ రెడ్డి( Ashish Reddy ) హీరోగా నటించిన లవ్ మీ ( Love Mee ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అలాగే ప్రొడక్షన్  డిపార్ట్మెంట్ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమా కోసం నటీనటులు పడే కష్టం కన్నా ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కష్టం చాలా ఉంటుందని చెప్పారు.అంతేకాకుండా  తన గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో అభిమానులు తనకు పిఆర్ టీంలాగ పనిచేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.తనకంటే ముందుగానే తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తారని అలాగే తన ఫోటోలను ఎడిట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారని ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు