‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ ఎంత బాగుందో..  సినిమా అంత కంటే బాగుంటుంది: వైష్ణ‌వ్ తేజ్‌

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.

బి స‌మ‌ర్ప‌ణ‌లో.

తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.

ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌.

ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు.మంగ‌ళ‌వారం సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Advertisement

ఈ కార్య‌క్ర‌మంలో.నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.

ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ పెయిర్ చక్కగా ఉంది.వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో చాలా హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నాడు.

సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ట్రైల‌ర్‌ను చూస్తున్న‌పుడు ఎంత ‘రంగ రంగ వైభవంగా’ ఉండిందో రేపు సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లో చూస్తున్న‌ప్పుడు కూడా అంతే రంగ రంగ వైభ‌వంగా ఉంటుంది.

సినిమాలో వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌.శ్యామ్ ద‌త్‌గారు సినిమాకు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

బి.వి.ఎస్‌.ఎన్‌.

Advertisement

ప్ర‌సాద్‌గారి వ‌ల్లే ఓ మంచి టీమ్ క‌లిసి మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.కేతికా శ‌ర్మ మంచి కోస్టోర్.

త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ల‌వ్ లీ ఎక్స్‌పీరియెన్స్‌.సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌కు వ‌చ్చి మా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను ఎంజాయ్ చేసి స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ చూస్తున్న వారిలో ఓ ఎన‌ర్జీని నేను గ‌మ‌నించాను.రేపు సినిమా చూస్తున్న‌ప్పుడు కూడా అదే ఎన‌ర్జీ ఉంటుంది.చాలా మంది ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టార‌ని అడిగారు.

ఇగోస్ లేని ఏ రిలేషన్‌షిప్ అయినా ‘రంగ రంగ వైభవంగా’గా ఉంటుంద‌నే చెప్ప‌ట‌మే మా సినిమా కాన్సెప్ట్‌.కాబ‌ట్టే ఆ టైటిల్‌ను పెట్టాం.అమ్మాయి- అబ్బాయి, ఇద్ద‌రు స్నేహితులు, రెండు కుటుంబాల మ‌ధ్యన ఆ రిలేష‌న్‌షిప్ ఉండొచ్చు.

సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం.టైటిల్‌కు త‌గ్గ స‌క్సెస్‌ను ప్రేక్ష‌కులు అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది.ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీని చేశాం.

ఈ సినిమాలో నాకు రాధ అనే పాత్ర‌ను ఇచ్చిన డైరెక్ట‌ర్ గిరీశాయ‌గారికి థాంక్స్‌.హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా కుదిరింది.

నిర్మాత‌లు బి.వి.ఎస్‌.ఎన్‌.

ప్ర‌సాద్‌, బాపినీడు గారికి థాంక్స్‌.వైష్ణ‌వ్ తేజ్ డైన‌మిక్ హీరో.

చాలా మంచి స్నేహితుడిలా సెట్స్‌లో ఉంటూ న‌న్ను ఆట‌ప‌ట్టించాడు.అలాగే స‌పోర్ట్ చేశాడు.

సెప్టెంబ‌ర్ 2న ‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ ద‌త్ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం ఎదురు చూస్తున్నారు.అలాంటి వారి కోసం ‘రంగ రంగ వైభవంగా’ సినిమా మంచి ఆప్ష‌న్ అవుతుంది.నేను, వైష్ణ‌వ్ తేజ్‌తో ఉప్పెన మూవీకి వ‌ర్క్ చేశాం.

ఇది మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో సినిమా.అలాగే బి.

వి.ఎస్‌.ఎన్‌.

ప్ర‌సాద్‌గారి ప్రొడక్ష‌న్‌లో ‘సాహసం’ మూవీ తర్వాత నేను చేసిన రెండో సినిమా.మూడు వారిద్ద‌రితో మూడోసారి క‌లిసి వ‌ర్క్ చేశాను.

ఇది ఫ‌న్‌, ల‌వ్‌, ఎంట‌ర్‌టైనింగ్ మూవీ.త‌ప్ప‌కుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు.

న‌టుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘అందరి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ‘రంగ రంగ వైభవంగా’ వంటి సినిమా వ‌చ్చి చాలా రోజులైంది.ప్ర‌సాద్‌గారి నిర్మాణంలో ఇలాంటి సినిమాలు ఇది వ‌ర‌కు రూపొందాయి.

ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి.ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ మీ ముందుకు సెప్టెంబ‌ర్ 2న రాబోతుంది.

కుటుంబం అంతా క‌లిసి చూసే సినిమా ఇది.గిరీశాయ‌గారు డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అంద‌ర‌రూ మెచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

తాజా వార్తలు