యూపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..?

దేశంలో ఐదు రాష్ట్రాల లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఐదు రాష్ట్రాలలో ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.

ఎలాగైనా ఇక్కడ గెలవాలని ప్రధాన పార్టీలు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావడంతో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది.

Uttar Pradesh Congress Cm Candidate Uttar Pradesh, Congress, Priyanka Gandhi, R

చాలా వరకు పోటాపోటీ ఇక్కడ బిజెపి, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య నెలకొంది.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ అనే టాక్ బలంగా వినబడుతుంది.

ఇటీవల మీడియా సమావేశంలో కూడా సీఎం అభ్యర్థి ఎవరు అని జర్నలిస్టులు ప్రశ్నలు వేయగా యూపీలో మీకు ఎక్కడ చూసినా నేనే కనబడతాను.మరి నేను కాక ఇంకెవరు ఉంటారు అంటూ పరోక్షంగా ఆమె వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

దీంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి దాదాపు ప్రియాంక గాంధీ యే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేయనున్నట్లు.20 లక్షల ఉద్యోగాలలో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ తోనే యూపీ కీ మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని అలాంటి పని చేసిన ప్రభాస్... మరీ ఇంత మంచోడివి ఏంటయ్యా!
Advertisement

తాజా వార్తలు