రాజీనామా చేయనున్న ఉత్తమ్....ఎందుకంటే

కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

దీనికి కారణం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీ పదవికి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.ఈ సారి తెలంగాణా లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం తో ఉత్తమ్ ఎమ్మెల్యే గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేసి గెలవడం తో ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

ఈ నెల 3 వ తేదీన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ గా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.దీనితో ఉత్తమ్ రాజీనామా చేస్తే మాత్రం హుజూర్ నగర్ లో త్వరలోనే ఉపఎన్నిక జరిగే అవాకాశం ఉంటుంది.దీనితో మరోసారి తెలంగాణ లో ఎన్నికల హడావిడి మొదలవుతుంది అన్నమాట.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు