రక్షణ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ఈ రోజే భాద్యతలు స్వీకరించారు.ఇటీవల కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ నెల 30 న భారత ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి విదేశీ అధినేతల తో పాటు,పలువురు బీజేపీ ప్రముఖులు, ఇతరులు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రక్షణ శాఖా మంత్రి గా రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రమాణస్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ఈ రోజే రాజ్ నాథ్ ఆ శాఖ భాద్యతలు తీసుకున్నారు.

ఆయన భాద్యతలు తీసుకున్న తరువాత ఈ రోజు ఉదయం నేషనల్ వార్ మెమోరియల్ ని సందర్శించారు.

Advertisement

అక్కడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు.రాజ్ నాథ్ తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్,ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా,నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ వార్ కూడా ఉన్నారు.గతంలో రక్షణ శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ పని చేయగా,ఇప్పుడు ఆ భాద్యతలు రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించారు.

ఈ సారి మోడీ క్యాబినెట్ లో నిర్మలా కు ఆర్ధిక మంత్రిగా అవకాశం అందించారు.

Advertisement

తాజా వార్తలు