ఈ హోం మేడ్ క్రీం ను వాడితే వారం రోజుల్లో అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మెరుస్తాయి!

బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, మృతకణాలు పేరుకుపోవడం, చెమట తదితర కారణాల వల్ల కొందరి‌ అండర్ ఆర్మ్స్ డార్క్ గా మారుతుంటాయి.

ఇలాంటి వారు స్లీవ్ లెస్ దుస్తులు ధరించేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

అండర్ ఆర్మ్స్ నలుపును వదిలించుకోవడం కోసం తోచిన చిట్కాలు అన్ని పాటిస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే కేవలం వారం రోజుల్లోనే అండర్ ఆర్మ్స్ తెల్లగా మరియు మృదువుగా మారడం ప్రారంభమవుతాయి.

మ‌రి ఆలస్య‌మెందుకు ఆ హోమ్ మేడ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement
Using This Home Made Cream Will Make Your Underarms Glow White And Soft, Underar

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బీస్ వ్యాక్స్ ముక్కలు వేసుకోవాలి.అలాగే తయారు చేసుకున్న ఆయిల్ ను వేసి డబల్ బాయిలర్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి.

ఇలా మెల్ట్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విట‌మిన్‌-ఈ ఆయిల్ వేసి బాగా కలిపితే మన క్రీమ్‌ సిద్ధమవుతుంది.

Using This Home Made Cream Will Make Your Underarms Glow White And Soft, Underar

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను కనక వాడితే డార్క్ అండర్ ఆర్మ్స్ నుండి విముక్తి లభిస్తుంది.

కేవలం కొద్ది రోజుల్లోనే అండర్ ఆర్మ్స్ తెల్లగా మరియు మృదువుగా మారతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు