అవిసె గింజలతో ఇలా చేశారంటే ఊడిన జుట్టు కూడా రెట్టింపుగా మొలుస్తుంది!

అవిసె గింజలు.( Flax Seeds ) ఇటీవల రోజుల్లో చాలా మంది వీటిని విరివిరిగా వాడుతున్నారు.

రుచి ఎలా ఉన్నా అవిసె గింజల్లో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.ఆరోగ్యపరంగా అవిసె గింజ‌లు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడతాయి.అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అవిసె గింజలను డైట్ లో చేర్చుకుంటూ ఉంటారు.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు( Hair Growth ) సైతం అవిసె గింజలు అద్భుతంగా సహాయపడతాయి.వీటిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఊడిన జుట్టు కూడా రెట్టింపుగా మొలుస్తుంది.

Advertisement
Use Flax Seeds Like This For Double Hair Growth Details! Hair Growth, Flax Seeds

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక కలబంద ఆకు ( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలు వేసుకోవాలి.

Use Flax Seeds Like This For Double Hair Growth Details Hair Growth, Flax Seeds

అలాగే ఒక చిన్న కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ) మరియు సపరేట్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను( Mild Shampoo ) ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

Use Flax Seeds Like This For Double Hair Growth Details Hair Growth, Flax Seeds

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు రాలడం( Hair Fall ) తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటిస్తే జుట్టు సిల్కీగా సైతం మారుతుంది.

Advertisement

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నవారు.ఒత్తైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు